మహేష్ కల్లో కూడా మర్చిపోలేని అట్టర్ ప్లాప్ సినిమా ని రీమేక్ చేస్తున్నారు !

KSK
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో గతంలో బ్రహ్మోత్సవం అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా పై అనేక అంచనాలు పెట్టుకున్న మహేష్ బాబు కి కలలో కూడా ఊహించని విధంగా డిజాస్టర్ ఎదురవ్వడంతో మహేష్ చాలా నిరాశ చెందారు.


మహేష్ కెరియర్ లో జయాపజయాలు ఒకసారి గమనిస్తే బ్రహ్మోత్సవం ఇచ్చినటువంటి చేదు అనుభవం వేరే ఏ సినిమా కూడా మిగిలించి ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పేరూ ఇండస్ట్రీలో కూడా వినబడక పోయింది. మొత్తంమీద భారీ అంచనాల మధ్య విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా ఇండస్ట్రీలో అత్యంత దారుణమైన డిజాస్టర్ సినిమాగా రికార్డు సృష్టించింది.


అయితే ఇప్పుడు ఈ సినిమాను కోలీవుడ్ లో ఓ దర్శకుడు రీమేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసిన వార్త సినీ వర్గాలను షాక్ కు గురి చేసింది.అక్కడ ప్రముఖ దర్శక నిర్మాత మరియు నటుడు చేరన్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.ఆ మధ్య ఈ సినిమాను చూసినపుడు తమిళ ప్రేక్షకులకు నచ్చే కోణాలు ఈ సినిమాలో ఉన్నాయని అందుకని తాను ఈ సినిమాను ఇక్కడ రీమేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మరి మహేష్ కెరియర్లో కల్లో కూడా ఊహించని ఈ అట్టర్ ఫ్లాప్ సినిమాని కోలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: