విజయ్ దేవరకొండని పిచ్చిగా ప్రేమించిన ముగ్గురు హీరోయిన్లు.. ఎవరంటే..?

Pandrala Sravanthi
విజయ్ దేవరకొండ ఈ పేరు వింటేనే చాలామంది అమ్మాయిలకి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. కేవలం మామూలు అమ్మాయిలే కాదు విజయ్ దేవరకొండ అంటే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు కూడా ఇష్టపడతారు.ముఖ్యంగా బాలీవుడ్ లో ఉన్న జాన్వీ కపూర్ లాంటి హాట్ హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ కి ఫ్యాన్స్ అయ్యారు. అవకాశం వస్తే ఆయనతో డేటింగ్ కి వెళ్తామని కూడా కొన్ని షోలలో స్వయంగా చెప్పారు హీరోయిన్స్.అయితే అలాంటి విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంది రష్మిక మందన్నా.అయితే ఇటు విజయ్ దేవరకొండ తో పాటు అటు రష్మిక మందన్నాకు కూడా ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.. అయితే రష్మిక మందన్నాని విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్నారు.కానీ విజయ్ దేవరకొండ ని ఇండస్ట్రీలో ఉన్న ఆ ముగ్గురు హీరోయిన్లు కూడా ప్రేమించారాట. మరి ఇంతకీ విజయ్ దేవరకొండని అంత పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్స్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 


విజయ్ దేవరకొండ టాలీవుడ్లోకి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసి ఎంట్రీ ఇచ్చారు. ఇక పెళ్లిచూపులు మూవీతో ఫస్ట్ టైం హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం హీరోగా  నటించిన పెళ్లిచూపులు సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ మారిపోయింది. అయితే ఈ సినిమా చేసే సమయంలో ఇందులో ప్రీతి శెట్టి పాత్రలో నటించిన శాలిని పాండే కి విజయ్ దేవరకొండ కి మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో నడుస్తుంది అనే టాక్ వినిపించింది.అంతే కదా శాలిని పాండే ఈ సినిమా చేసే సమయంలోనే విజయ్ దేవరకొండకు ప్రపోజ్ చేశారని కూడా రూమర్స్ వినిపించాయి.కానీ ఈ రూమర్స్ పై విజయ్ దేవరకొండ గానీ శాలిని పాండే గానీ స్పందించలేదు. అలాగే గీతా గోవిందం సినిమా చేసే సమయంలో రష్మిక విజయ్ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ సినిమా తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాకి ఇప్పటికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.


అలా ఈ రెండు సినిమాలు చేసే సమయంలో విజయ్ రష్మికల మధ్య బాండింగ్ మరింత ఎక్కువై అప్పటినుండి ఈ జంట రిలేషన్ లో ఉన్నారు. ఇక రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ లు రిలేషన్ లో ఉన్నారని తెలిసినప్పటికీ విజయ్ దేవరకొండ తో ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేసే సమయంలో మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడినట్టు టాక్ వినిపించింది. కానీ ఇందులో ఎంత నిజముందో కూడా తెలియదు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత ఏడాది విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీలోని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జోరుగా జరిగింది.అంతేకాదు రష్మిక పోలికలతో ఉన్న భాగ్యశ్రీ బోర్సేని విజయ్ కావాలనే సినిమా కోసం తీసుకున్నారనే ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ సినిమా చేసే సమయంలో రష్మిక విజయ్ లకు గొడవ జరిగిందని రష్మిక భాగ్యశ్రీ బోర్సేకి వార్నింగ్ ఇచ్చిందనే  కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఇవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. అలా విజయ్ దేవరకొండని ఇండస్ట్రీలో ఈ ముగ్గురు హీరోయిన్లు ప్రేమించినట్టు రూమర్స్ వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: