పవన్ కళ్యాణ్: ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది..?
జానీ సినిమా ఫ్లాప్ గురించి అడగగా.. పవన్ కళ్యాణ్ ఇలా సమాధానాన్ని ఇచ్చారు. తాను చిరంజీవి తమ్ముడు అయ్యి ఉండి కూడా.. అప్పటికే హిట్స్ లో ఉన్న జాని చిత్రం ఫ్లాప్ అయ్యింది. దీంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్షియర్స్ తన ఇంటి మీదికి డబ్బుల కోసం వచ్చారని. అది కూడా సినిమా విడుదలై ఐదు రోజులు పది రోజులు కూడా కాదు.. కేవలం మొదటి షో పడింది బాగలేదని వచ్చేసారని తెలిపారు. సినిమా ఆడట్లేదు మా డబ్బులన్ని పోయాయి అంటూ తన ఇంటి మీదికి వచ్చారని.. ఆ సమయంలోనే ఒకవేళ సినిమా హిట్ అయితే నాకేం ఇచ్చేవారు అనే ప్రశ్న? తన మైండ్ లో వచ్చింది.. కానీ ఆ విషయాన్ని అక్కడున్న వారు ఎవరు ఆలోచించలేదు అంటూ తెలిపారు.
అప్పుడే ఆర్థిక ఇబ్బందులు కనిపించాయి. తన రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చేశానని సినిమా ఫ్లాప్ అయితే బాధపడాలని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు.. అప్పుడు తాను ఒంటరిగా ఉన్నాను ఆ సమయంలో రూ.15 లక్షల రూపాయలు అప్పుచేసి క్లియర్ చేయడానికి సమయం పట్టిందని తెలిపారు.. ఆ అనుభవమే తనను బలమైన వ్యక్తిగా మార్చి పొలిటికల్ లీడర్ గా మారడానికి జానీ మూవీ ఫెయిల్యూర్ హెల్ప్ చేసిందని వెల్లడించారు.. 2019లో కూడా తాను ఓడిపోయిన రోజులను గుర్తుచేసుకొని మరి ఫెయిల్యూర్ అనేది కూడా లైఫ్ లో ఒక భాగమే అని తెలుసుకున్నానని తెలిపారు పవన్ కళ్యాణ్..