క‌న్న‌ప్ప 200 కోట్ల రూపాయిల భారీ రిస్క్ ... విష్ణు ఏంటి ఈ ధైర్యం... ?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కన్నప్ప అనేది టాలీవుడ్ లో మంచు వారి అబ్బాయి మంచు విష్ణు కలల ప్రాజెక్టు. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు.. నమ్మకాలు లేవు. ఓ భారీ పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నా అన్నప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ క్రమంగా ఈ ప్రాజెక్టులో కి టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - మోహన్ లాల్ - అక్షయ్ కుమార్ - కాజల్ లాంటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ సినిమా గురించి ఆసక్తి మొదలైంది. ఆ తర్వాత విష్ణుని ట్రోల్ చేస్తున్న ... వెటకారంగా మాట్లాడుతున్న అసలు పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు. దాదాపు 200 కోట్లు ఖర్చుపెట్టి తీశాడు అన్నది నిజం. ఈ సినిమా వర్కౌట్ అవ్వాలంటే ప్రభాస్ అభిమానులు సాయం పట్టాలన్నది నిజం. ప్రభాస్ పాత్ర రెబల్ అభిమానులకు నచ్చితే పంట పండినట్టే.


అయితే ఈ సినిమా ఓటిటీ హక్కులు ఇంకా అమ్మలేదు. ఆడియో రైట్స్ అమ్మలేదు. ఏరియాల‌ వారిగా అమ్మలేదు. 200 కోట్లకు 200 కోట్లు పెద్ద రిస్కే. సినిమా బాగుంటే మంచి టాక్ వస్తే ప్రతి పైసా తిరిగి వస్తుందని నమ్మకంతో ఇంత రిస్క్ పెట్టి రిలీజ్‌ చేస్తున్నాడు విష్ణు. ప్రమోషన్లు చాలా గట్టిగా చేశాడు. ప్రభాస్ ఒక్క ఈవెంట్ కు వచ్చిన బాగుండేది. ప్రభాస్తో ఓ కామన్ ఇంటర్వ్యూ చేసి బయటకు వదిలిద్దాం అనుకున్న అది కూడా కుదరలేదు. ఈ సినిమాలో ఇంత మంది స్టార్లు ఉన్న అన్ని తాను ఒక్కడే మోసాడు విష్ణు. కన్నప్ప విడుదలకు ఇంకా ఒకరోజే సమయం ఉంది. అడ్వాన్స్ బుకింగ్లు కూడా మొదలు కాబోతున్నాయి. ప్రీమియర్లు వేయాలని విష్ణు భావించిన ఆ ఆలోచన ఇప్పుడు విరమించుకున్నట్టు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్‌లు .. ట్రెండ్ ప్రీమియర్ షో టాక్ బట్టి కన్నప్ప రిజల్ట్ ఏంటి అనేది తేలిపోనుంది.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: