మెగా కోడలు లావణ్య త్రిపాటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తన కంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ప్రముఖ నటుడు వరుణ్ తేజ్ ను ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకు పూర్తిగా దూరమైంది. తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించింది. ఇక వీరి వివాహం జరిగి సంవత్సరం పైనే అయింది.
రీసెంట్ గానే వరుణ్ తేజ్, లావణ్య దంపతులు తమ కుటుంబ సభ్యులకు అభిమానులకు గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. వారు తల్లిదండ్రులు కాబోతున్నామని ఓ ఫోటోను వారి ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. ఆ వార్త విన్న అనంతరం తమ అభిమానులు, కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలారు. ఇక లావణ్య త్రిపాఠి తన ప్రెగ్నెన్సీని చాలా ఎంజాయ్ చేస్తోంది. రెస్ట్ తీసుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటుంది. తన కడుపులోని బిడ్డకు ఎలాంటి అపాయం వాటిల్లకుండా జాగ్రత్తగా ఉంటుంది.
ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి తన బేబీ బంప్ తో ఉన్న ఓ వీడియోనూ తన అభిమానులతో పంచుకుంది. బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి బుక్స్ చదువుతూ నేచర్ ని ఎంజాయ్ చేస్తోంది. తన ఇంట్లోనే చెట్ల మధ్యలో పడుకోని బేబీ బంప్ తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అది వైరల్ అవుతుంది. అందులో లావణ్య త్రిపాఠి బేబీ బంప్ చాలా క్లియర్ గా కనబడుతోంది. ఆ వీడియోని చూసిన చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.
మరి కొంతమంది మాకు లావణ్య త్రిపాఠి లాంటి బేబీ గర్ల్ కావాలని అంటుండగా మరి కొంతమంది వరుణ్ తేజ్ లాంటి బేబీ బాయ్ కావాలని మరి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి లావణ్య త్రిపాఠి ఆరోగ్యంగా మంచి బిడ్డకు జన్మనివ్వాలని తన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. దీనిపై లావణ్య త్రిపాఠి ఎలా స్పందిస్తుందో చూడాలి.