నాగచైతన్య - లావణ్య త్రిపాఠి కాంబోలో మిస్ అయిన ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!

Thota Jaya Madhuri
నాగచైతన్య .. రీసెంట్ గానే తండేల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న హీరో . నాగచైతన్య గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పనేలేదు . నాగేశ్వరరావు గారి మనవడు ..నాగార్జున గారి కొడుకు ఇక యాక్టింగ్ స్టైల్స్ ఎలా ఉంటాయి అనేది అందరూ అర్థం చేసుకోవచ్చు . అయితే ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అవుతున్న స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు . ఇప్పుడిప్పుడే ఆ స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంటున్నాడు . కాగా నాగచైతన్య ప్రెసెంట్ విరుపాక్ష డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే కమిట్ అయినట్లు తెలుస్తుంది .


కాగా ఈ సినిమా కోసం చాలామంది హీరోయిన్స్ ని అనుకున్నారట . ఫైనల్లీ పూజ హెగ్డే ని  ఫైనలైజ్ చేసారట . ఇదే మూమెంట్లో నాగచైతన్య హీరోయిన్ లావణ్య త్రిపాటి కాంబోలో రావాల్సిన సినిమా మిస్సయింది అన్న డీటెయిల్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఆ మూవీ మరేంటో కాదు మజిలీ . డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అనేది అందరికీ తెలుసు . నిజానికి సమంత పాత్రలో ముందుగా లావణ్య త్రిపాఠిని అనుకున్నారట .


అంతకుముందు కీర్తి సురేష్ ని కూడా అనుకున్నారట . కానీ కీర్తి సురేష్ ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట.  లావణ్య త్రిపాఠి కూడా ఈ పాత్రను రిజెక్ట్ చేసింది.  దానికి కారణం వరుణ్ తేజ్ తో ప్రేమాయణం నడుపుతూ ఉండడమే . ఆ తర్వాత ఆ పాత్రకి సమంత శివనిర్వాణనే ఓపెన్ గా వెళ్లి ఈ పాత్ర చేయండి అంటూ సమంతను అడిగేసారట . సమంత ఒప్పుకోవడం సినిమా వెంటనే సెట్స్ పై కి రావడం.. రిలీజ్ అవ్వడం సూపర్ డూపర్ హిట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి . ఆరోజు లావణ్య త్రిపాఠి - నాగచైతన్య తో నటించి ఉంటే ఆమె కెరియర్ ఇప్పుడు వేరే రేంజ్ లో ఉండేది అంటున్నారు అభిమానులు.  కేవలం ఈ సినిమానే కాదు వరుణ్ తేజ్ కోసం బడా  హీరోలతో నటించే అవకాశం వచ్చిన మిస్ చేసుకుంది లావణ్య త్రిపాఠి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: