మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా మారిన బ్యూటీ .. 5వేలు జీతం కోసం ఎంతకు తెగించిందంటే..!

frame మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా మారిన బ్యూటీ .. 5వేలు జీతం కోసం ఎంతకు తెగించిందంటే..!

Amruth kumar
హిందీలో స్టార్ సెలబ్రిటీల్లో ఈమె కూడా ఒకరు .. అతి తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది .. కానీ ఒకప్పుడు  5000 జీతం కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసింది .. ఇంతకీ ఈమె ఎవరంటే .. తెలుగుతో పాటు హిందీలోను ఈమె ఎన్నో హిట్‌ సినిమాలో నటించింది .. ఈమె ఎవరో కాదు హీరోయిన్ దియా మీర్జా ..  2001 లో వచ్చిన రెహ్నా హై తేర్రే దిల్ మే సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు .. కానీ ఆ సినిమాతోనే బాగా పాపులారిటీ తెచ్చుకుని దియా .. అయితే సినిమాల్లోకి రాకముందు ఈమె 2000 సంవత్సరంలో ఈమే మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ టైటిల్ ను కూడా గెలుచుకుంది . ఇక తర్వాత మాధవన్ , షారుక్ ఖాన్ , రన్బీర్ , నాగార్జున వంటి అగ్ర హీరోలతో కలిసి సినిమాలు చేసింది .

అయితే రీసెంట్ గానే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దియా మీర్జా మాట్లాడుతూ . 19 ఏళ్ల వయసులో ఐశ్వర్యరాయ్ తో నన్ను పోల్చడం నాకు చాలా బాధ కలిగింది . కానీ అది తనపై చాలా ఒత్తిడి పెంచిందని కూడా ఆమె అంది .. నటిగా తన కెరియర్ మొదలుపెట్టిన తొలినాల్లో తనను ఇతర హీరోయిన్లతో పోల్చడం గొప్ప ప్రశంసగా అనిపించిందని అన్నారు .. కానీ అంతర్జాతీయ అందాల టైటిల్ గెల్చుకున్నప్పటికీ తన గురించి తాను ఎప్పుడు ఆనంద పడలేదు అంటూ చెప్పకు వచ్చింది .. అయితే ఈమె చివరగా 2024 లో ఇబ్రహీం అలీ ఖాన్ మొదటి సినిమా నదానియన్, వెబ్ సిరీస్ IC 814: ది కాందహార్ హైజాక్‌లో లో నటించింది.

అయితే దియాకు ఐదు సంవత్సరాల వయసు ఉన్న సమయంలోనే ఆమె తల్లిదండ్రులు విరిపోయారు .. ఆమె తల్లి హైదరాబాదుకు చెందిన అహ్మద్ మీర్జా అనే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది .. ఆ తర్వాత దియా మీర్జా తన సవతి తండ్రి ఇంటి పేరుగా మార్చుకుంది .. బాలీవుడ్లోకి అడుగుపెట్టడానికి ముందు ఒక మీడియా సంస్థలలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా కూడా పనిచేసిందట  .. ఆ సమయంలో ఆమెకు 5000 జీతం ఇచ్చారని గతంలో ఆమె అనేక సందర్భాల్లో చెప్పింది ..  ప్రస్తుతం దియా మీర్జా ప్రముఖ వ్యాపారవేత వైభవ్ రేఖీని పెళ్లి చేసుకుంది .. జులై 21లో వీరికి ఒక బాబు కూడా జన్మించాడు .



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: