ఒక్క సూపర్ హిట్ ఆ క్యూట్ బ్యూటీ ఫేట్ నే మార్చేసిందిగా..!

frame ఒక్క సూపర్ హిట్ ఆ క్యూట్ బ్యూటీ ఫేట్ నే మార్చేసిందిగా..!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల సందడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్లు సైడ్ అవుతున్న తరుణంలో యంగ్ బ్యూటీలు లైన్ లోకి వస్తున్నారు.తమ అందం, అభినయం, డ్యాన్స్, క్యూట్ స్పీచ్ తో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ వరుసలో ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి నేషనల్ క్రష్ గా మారిన రష్మిక మందన్న నుంచి మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ బోర్సే, ఆషికా రంగనాథ్ తదితర హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మిక మందన్న ఇండస్ట్రీని ఏలుతున్న సంగతి తెలిసిందే. మిగితా హీరోయిన్లు కూడా తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.కాగా తాజాగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ క్రష్ లిస్ట్ లోకి చేరిపోయింది. నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళం, తెలుగు ఆడియెన్స్ ను తన అందంతో మంత్రముగ్ధులను చేస్తోంది. తను ఇచ్చిన బ్యూటీఫుల్ పెర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.... ఇంతకీ ఈ అమ్మడు ఎవరు? ఏ చిత్రంలో నటించి చించేసిందనుకుంటున్నారా? 'లవ్ టుడే'తో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారిన ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ గా 'డ్రాగన్' చిత్రంతో థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు వచ్చింది.


తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'గా విడుదలైంది. తెలుగు, తమిళంలో తొలిరోజే మంచి ఫలితాలను అందుకుంది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ ను అందుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.49.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందీ చిత్రం. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంతో కయాదు లోహర్ పేరు బాగా వినిపిస్తోంది. డ్రాగన్ లో మెయిన్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ అయినప్పటికీ... కయాదు లోహర్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఎలెమెంట్ గా మారింది. అనుపమాను బీట్ చేసి హీరోయిన్ క్రేజ్ ను లోహర్ అందుకుంది.ఇక కయాదు లోహర్ తెలుగులోనూ ఓ చిత్రం చేసింది. శ్రీవిష్ణు పోలీస్ అధికారికిగా నటించిన 'అల్లూరి'లో కయాదు లోహరే హీరోయిన్. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. 2022లో వచ్చిన ఈ క్రైమ్ డ్రామా ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయింది. పైగా ఈ చిత్రంలో కయాదు పెర్ఫామెన్స్ ఎందుకో ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకునేలా కనిపించలేదు. దీంతో అప్పుడు ఈమెను ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 'డాగన్'తో హిట్ పడగానే ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: