ఆ హీరోయిన్ బతికుంటే రాజమౌళి భార్య అయ్యేదా.. కానీ బ్యాడ్ లక్.?

frame ఆ హీరోయిన్ బతికుంటే రాజమౌళి భార్య అయ్యేదా.. కానీ బ్యాడ్ లక్.?

Pandrala Sravanthi
ఏంటి ఆ దివంగత హీరోయిన్ ని రాజమౌళి పిచ్చిపిచ్చిగా ప్రేమించేసారా.. ఇంతకీ రాజమౌళి అంత గాఢంగా ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు వారి పెళ్లి జరగలేదు అనేది ఇప్పుడు చూద్దాం.. పాన్ ఇండియా అనే పదాన్ని ఇండియన్ సినీ హిస్టరీ కి పరిచయం చేసింది డైరెక్టర్ రాజమౌళి. ఆయన తన దర్శకత్వ ప్రతిభతో టాలీవుడ్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. అయితే ఎలాంటి రాజమౌళి పెళ్లయి ఒక బాబు ఉన్న రమాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే రాజమౌళి పెళ్లయిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంపై అప్పట్లో చాలానే వార్తలు వినిపించాయి. కానీ వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ మళ్ళీ వారిని కలిపింది అని చెప్పుకోవచ్చు. ఇక రమా రాజమౌళికి మొదట కార్తికేయ అనే బాబు ఉన్నాడు. ఇక ఆ బాబు కోసం రాజమౌళి మళ్లీ పిల్లల్ని కూడా కనలేదు.


 ఈ విషయం పక్కన పెడితే.. రాజమౌళి రమా రాజమౌళి ని ప్రేమించక ముందే మరో హీరోయిన్ ని ప్రేమించారట. ఆ హీరోయిన్ ని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. మరి ఇంతకీ రాజమౌళి అంతగా ప్రేమించిన హీరోయిన్  ఎవరయ్యా అంటే.. దివంగత మహానటి సావిత్రి.అవును మీరు వినేది నిజమే. సావిత్రి అంటే రాజమౌళికి చెప్పలేనంత ఇష్టమట. అయితే రాజమౌళి కంటే వయసులో సావిత్రి చాలా పెద్దది. కానీ ఈ విషయం తెలియని ఏజ్ లోనే సావిత్రిని రాజమౌళి ఇష్టపడ్డారట. అయితే సావిత్రిని ఎప్పుడైతే సినిమాల్లో చూసారో అప్పటినుండి సావిత్రి పైన ప్రేమ పెంచుకున్నారట. ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళికి సావిత్రి అంటే చెప్పలేనంత క్రష్ అట.

 


అందుకే ఆ ఇష్టం ప్రేమగా మారి పెద్దయ్యాక సావిత్రిని పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్ తో పెరిగారట.కానీ చివరికి సావిత్రికి అప్పటికే పెళ్లయిపోయింది. అలాగే ఆమె తనకంటే వయసులో చాలా పెద్దది అని తనకి తానే సర్ది చెప్పుకొని సావిత్రిని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వదులుకున్నారట. అయితే ఇదంతా చిన్నతనంలో రాజమౌళి మైండ్ లో కి వచ్చిన ఆలోచనలు.. అయితే సావిత్రి గనుక బతికి ఉంటే కచ్చితంగా ఆమెని ఓ పవర్ఫుల్ పాత్రలో పెట్టి సినిమా తీసే వాడిని అంటూ రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో సావిత్రి గురించి గొప్పగా చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: