గేమ్ చేంజర్ కోసం ఒక్కటైన ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. నెట్టింట అలాంటి ప్రచారం

frame గేమ్ చేంజర్ కోసం ఒక్కటైన ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. నెట్టింట అలాంటి ప్రచారం

MADDIBOINA AJAY KUMAR
రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా నేడు విడుదల అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుంది. అలాగే తెలుగు అమ్మాయి అంజలి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా విభినంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకటైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫాన్స్ రామ్ చరణ్ సినిమాపై దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలా సినిమాపై దాడి చేయడం అన్యాయం అంటూ ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతుంది. సాధారణంగా, కొద్ది శాతం మంది అభిమానులు మాత్రమే ప్రతికూలత మరియు ద్వేషాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెడతారని ఆ పోస్టులో రాసుకొచ్చారు. అయితే రామ్ చరణ్ అభిమానులు కూడా గతంలో ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్‌పై దాడి చేసి ఉండవచ్చని తెలిపారు. కానీ ఆ దాడులు ఎప్పుడు కనిపించలేదని.. ప్రస్తుతం రామ్ చరణ్ మరియు అతని సినిమాపై జరుగుతున్న ఈ దాడి స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు. అలాగే స్క్రీన్‌పై లేనప్పటికీ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చాటుకునే అతికొద్ది మంది హీరోల్లో చరణ్‌ ఒకరని ప్రశంసించారు. ఇక ఇప్పుడు ఈ సోషల్ మీడియా పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్ గా 6600కి పైగా థియేటర్లలో విడుదల అయ్యింది. కాగా.. రూ. 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. అయితే, గేమ్ ఛేంజర్ సినిమాకు ఇండియాలో రూ.40 కోట్ల గ్రాస్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: