గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం మెగా హీరో లేటెస్ట్ మూవీ 'గేమ్ చేంజర్' సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా సినిమాలోని కొన్ని సీన్స్ ని పెట్టి ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఆ సీన్ లో.. సినిమా స్టార్టింగ్ లో రైలు పట్టాలపై కొందరిని తాళ్లతో కట్టేసి ఉంచుతారు. సరిగ్గా రైలు వచ్చే ముందే హీరో రామ్ చరణ్ హెలికాప్టర్ లో నుండి ఒక కత్తితో ఆ తాళ్లని కత్తిరిస్తాడు. వెంటనే వాళ్లు పైకి లేచాక రైలు వెళ్ళిపోతుంది. వాళ్ల ప్రాణాలు నిలుస్తాయి. ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి.. 'గేమ్ చేంజర్ మూవీలో.. లాజిక్ ఎక్కడ? ఫిజిక్స్ ఎక్కడ?. క్రీన్జీలో భారతీయుడు 2 సినిమాను మించిపోయింది' అని ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుంది.
ఇకపోతే శంకర్ దరకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉండే. గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ ద్వీపాత్రాభినేయం చేస్తుండడంతో ప్రేక్షకులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ IAS అధికారిగా కనిపించడం విశేషం. అతని సున్నితమైన ప్రవర్తన సజావుగా ముడిపడి, మాస్-ఆకర్షణీయమైన అంచుతో మిళితం అయినట్లు తెలుస్తోంది. చమత్కారం యొక్క మరొక పొరను జోడిస్తూ, చరణ్ వృద్ధ పాత్రలో అప్పన్నగా కూడా కనిపించడంట. రామ్ చరణ్ నటనకు వావ్ ఫ్యాక్టర్ ఇచ్చేలా ఉందని అంటున్నారు కొందరు.