ఒక్కరు చాలంటున్న యంగ్ హీరోలు... ముగ్గురు పక్కా అంటున్న సీనియర్లు.. ఇదేందయ్యా ఇది!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అంచలంచాలుగా ఎదుగుతోంది. సీనియర్ హీరోలతో పాటు ఇప్పుడు యంగ్ హీరోలు కూడా పెరిగిపోతున్నారు. ఒక్కప్పుడు సినిమాలో ఒక్క హీరోయిన్ మాత్రమే ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్ లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ హీరోల సినిమాల్లో ఒక్కరి కన్న ఎక్కువ హీరోయిన్ లు ఎక్కువగా కనిపిస్తున్నారు. యంగ్ హీరోల సరసన కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి సినీ పరిశ్రమలో యంగ్ హీరోలు ఒక్కరు చాలంటున్న.. సీనియర్ హీరోలు మాత్రం ముగ్గురు పక్కా అంటున్నట్లు తెలుస్తోంది.
అయితే జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ని, పాటను కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబుకి జోడిగా ప్రగ్య జైస్వాల్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అలాగే సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన వెంకీ మామ సినిమా తెరకెక్కనుంది. సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ టైటిల్ తో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో హీరోయిన్ లుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక డాకు మహారాజ్ సినిమా నుంచి ఇద్దరు హీరోయిన్ లు, అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి ఇద్దరు హీరోయిన్ లు నటిస్తున్నారు. దీంతో సీనియర్ హీరోల సినిమాల్లో ఒక్కరి కన్నా ఎక్కువ హీరోయిన్లు ఉండాలని అంటునట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: