సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దిల్ రాజు భారీ రిస్క్.. నష్టాలతో రిలీజ్ చేస్తున్నారా?
స్లాట్ సమస్య వల్ల ప్రముఖ ఓటీటీ సంస్థలు సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ హక్కులను తీసుకోలేదని భోగట్టా. చిరంజీవి విశ్వంభర సినిమాకు సైతం గతంలో ఇదే సమస్య ఎదురైంది. ఈ రిస్క్ అటూఇటుగా 10 నుంచి 15 కోట్ల రూపాయల మేర ఉంటుందని తెలుస్తోంది. కేవలం 72 రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్నాం మూవీ షూటింగ్ పూర్తి కావడం కొసమెరుపు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు హిట్ టాక్ వస్తే డిజిటల్ రైట్స్ విషయంలో ఎలాంటి సమస్య లేదని టాక్ అటూఇటుగా వస్తే మాత్రం ఇబ్బందేనని తెలుస్తోంది. టాలీవుడ్ లో అత్యంత వేగంగా సినిమాలను తెరకెక్కించే దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి కూడా చేరారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. క్వాలిటీ విషయంలో రాజీ పడలేదని 2 గంటల 22 నిమిషాల నిడివితో ఈ సినిమా రిలీజ్ అవుతోందని తెలుస్తోంది.
అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ తర్వాత సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విక్టరీ వెంకటేశ్ ఈ సినిమాతో మరోసారి సంక్రాంతి హీరో అనిపించుకుంటాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గతేడాది సైంధవ్ తో నిరాశపరిచిన వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ష్యూర్ షాట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దిల్ రాజు కొన్ని రోజుల గ్యాప్ లో రెండు సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. నిర్మాతగా దిల్ రాజుకు భారీ హిట్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.