ఆంటీ అంటూ కామెంట్స్... ఇచ్చిపడేసిన మాధవి లత ?
తాజాగా సంచలన పోస్ట్ కూడా పెట్టింది మాధవి లత. కొంతమంది సైకోస్ నన్ను ముసలిదానివి అయిపోయావు అంటున్నారు వయసు జీవితం శాశ్వతం వాళ్ళకి కూడా కాదు అనే నిజం ఎలా మర్చిపోయారు? అంటూ చురకలు అంటించారు. నా ఏజ్ వచ్చేసరికి మరణం అంచులో ఉండే యువత నన్ను అంటుంటే నా ఒక్కదానికి వయసు అవుతుందా ? అని ప్రశ్నింంచారు. మీరంతా శాశ్వత జీవులా అనే డౌట్ వస్తుంది సుమీ అంటూ సెటైర్లు పేల్చారు.
సృష్టి ధర్మం నేను గౌరవిస్తానని... ఔను నేను పుట్టాను పెరిగానని తెలిపారు. నాకు వయసు అవుద్దని తెలిపారు. కొన్నాలకు మరణిస్తానని పేర్కొన్నారు. దీన్ని ఆపగలిగే దమ్మున్న మనుషులు శాశ్వతంగా ఉండండి అంటూ పోస్ట్ పెట్టారు మాధవి లత. ఔను నాకు వయసు పెరుగుతుందని... చర్మం ముడతలు వస్తాయన్నారు. తెల్ల వెంట్రుకలు వస్తాయని... ఇది ప్రకృతి ధర్మం అని చెప్పారు. సహజం ….. మీరు నన్ను ఆంటీ అన్న అవ్వ అన్నా నాకేం సమస్య లేదని చురకలు అంటించారు.
నా కోసం కాకుండా... మీకోసం ఆలోచన చేస్తే కనీసం నా ఏజ్ వచ్చేసరికి అంకుల్ కాకుండా ఉంటారని చురకలు అంటించారు. 50 ఏళ్ల అంకుల్ నన్ను ఆంటీ అని పిలిస్తే...ఎలా అండి? అంటూ ప్రశ్నించారు మాధవి లత. మీరెలా పిలిచినా మీ వయస్సుని ఆపలేను... నా మనసుని మార్చలేరని చురకలు అంటించారు. ఆపాలి అనే ఆలోచన నాకు లేదు.... శాశ్వత అందం కావాలని కోరిక లేదని చెప్పారు మాధవి లత.