బిగ్ ప్లాన్ వేసిన శంకర్.. కానీ గేమ్ చేంజర్ హిట్ అయితేనే?
ఇప్పటి వరకు చూసుకుంటే... గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు నెటిజెన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ రాగా.. ట్రైలర్ కు పాజిటివ్ రిపోర్ట్ వస్తోంది. శంకర్ చెప్పినట్లు కొత్త కొత్త షాట్స్.. సాంగ్స్ లో ప్రయోగాలు ట్రైలర్ లో శాంపిల్ గా చూపించినట్టు కనబడుతోంది. వాస్తవానికి మూడేళ్ల నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోవటం వలన.. గేమ్ ఛేంజర్ పై ఆడియన్స్ లో పెద్దగా అంచానాలు లేవని చెప్పుకోవాలి. అయితే విడుదలకు ముందు ట్రైలర్ హైప్ ను క్రియేట్ చేయడం వలన ఒక్కసారిగా ఈ సినిమా అంచనాలను పెంచేసింది. మరీ సినిమా ఏ మేరకు అంచానాలు అందుకుంటుందో చూడాలి.
ఏది ఏమైనా గేమ్ చెంజర్ సినిమా హిట్ కావడం అనేది హీరో రామ్ చరణ్ కంటే కూడా దర్శకుడు శంకర్ కి చాలా అవసరంగా కనబడుతోంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా శంకర్ ప్లాప్స్ ఇస్తూ వస్తున్నాడు. దాంతో ఈ సినిమా హిట్ కావడం అనేది శంకర్ కి చాలా అవసరంగా మారింది. మరోపక్క ఈ సంక్రాతి పండగకి వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఉండడంతో పబ్లిసిటీ విషయంలో ఈ సినిమా టాప్ ప్లేస్ లో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం బాలకృష్ణ డాకూ మహరాజ్ తో రావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సీజన్లో ముందు విడుదలవుతోన్న గేమ్ ఛేంజర్ పై ఆయా సినిమాలు ఎఫెక్ట్ ఎట్టా ఉండబోతోంది అనే విషయం ఈ సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందని చాలా స్పష్టం అవుతోంది.