నాని వదులుకున్న ఆ రెండు సినిమాలతో .. ఆ ఇద్దరు హీరోలకు గట్టిగానే కలిసి వచ్చిందిగా..?
ఇక వరుసగా మూడు విజయాలు అందుకుని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో పారడైజ్ అనే సినిమా చేస్తున్నారు .. దసరా తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా శైలేష్ కులను దర్శకత్వంలో హిట్ 3 మూవీ కూడా చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా నాని వదిలేసిన రెండు సినిమాలు వల్ల ఇద్దరు స్టార్ హీరోలుగా మారారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక నిజానికి నాని మంచి సినిమాలు చేస్తున్నాడు అలాగే అనుకోకుండా కొన్ని మంచి కథలు కూడా వదులుకున్నాడు. వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు వరుసగా రెండు స్టోరీలు నానికి చెప్పారట .. వాటిలో ఒకటి సార్ కాగా మరొకటి లక్కీ భాస్కర్.. ఇక ఈ రెండు కథలను విన్ననాని రెండిటికి నో చెప్పటం ఇక్కడ విశేషం .. అయితే ఈ రెండు సినిమాలని పరభాష హీరోలతో తెరకెక్కించి వెంకీ అట్లూరి మంచి విజయం అందుకున్నారు .. సార్ సినిమాతో ధనుష్ కి లక్కీ భాస్కర్ తో దుల్కర్ సల్మాన్ కి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టి స్టార్ హీరోలుగా మార్చాడు.
ఇక ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో వెంకీ కూడా స్టార్ దర్శకుల లిస్టులో చేరిపోయాడు. ప్రస్తుతం ఆయన మరోసారి ధనుష్తోనే ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది .. ఇక ఆయన తెలుగు హీరోల వైపు పెద్దగా ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు .. ఎక్కువగా ఇతర భాష హీరోల తో తనకు చాలా కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆయన వారితోనే సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంకీ అట్లూరి ఇలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం .. ఎందుకంటే వైవిధ్యమైన కథాంశాలను తీసుకువచ్చి మంచి విజయాలను అందుకుంటున్నారు .. మరి ఇలాంటి సందర్భంలో మన తెలుగు హీరోలు అతనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతోమంది.