తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు.ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోలు అందరూ వాళ్లను వాళ్ళు సూపర్ స్టార్లుగా మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఇప్పుడు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ఆయన చాలా రకాల ప్రయత్నాలైతే చేస్తున్నాడు.ఈ క్రమంలోగుంటూరు కారం తర్వాత మరో సినిమాను మహేష్ బాబు సెట్స్ మీదకు తీసుకు వెళ్ళలేదు. మహేష్ బాబు గుంటూరు కారం ఆశించిన స్థాయిలో
ఆదరణ దక్కలేదు.ఇదిలావుండగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ విడుదల అయ్యి దాదాపు మూడు ఏళ్లు కావస్తుంది. ఎట్టకేలకు ఆయన తన తదుపరి సినిమాకి క్లాప్ కొట్టబోతున్నారు.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు 2025 జనవరిలో జరగబోతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.రాజమౌళి ఈ సినిమాను రెండు భాగాలుగా చేయబోతున్నారట. బాహుబలిని రెండు పార్ట్‌లుగా విడుదల చేసిన రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కథ పెద్దది అయినా ఒకే పార్ట్‌లో తీసుకు వచ్చారు. కానీ మహేష్ బాబుతో తీయబోతున్న సినిమాను మాత్రం రెండు పార్ట్‌లుగా విడుదల చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. రెండు పార్ట్‌ల షూటింగ్ వేరు వేరుగా చేయనున్నారు. 2025 సమ్మర్ నుంచి మొదటి పార్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి సినిమాను 2027లో విడుదల చేయనున్నారు.
సినిమా మరీ ఆలస్యం కాకుండా రాజమౌళి మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకోనున్నారు.మొదటి పార్ట్ విడుదల అయిన వెంటనే రెండో పార్ట్ మొదలు పెట్టబోతున్నారు. రెండో పార్ట్‌ను 2029లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. రాజమౌళి ఏం చేసినా పక్కా ప్లాన్‌తో చేస్తారు. ప్రతీది ముందస్తుగా ప్లాన్ చేసుకుంటారు. అందులో భాగంగానే మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాను రెండు పార్ట్‌లుగా చేయడం మొదలుకుని 2027లో మొదటి పార్ట్, 2029లో రెండో పార్ట్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.మహేష్ బాబు, రాజమౌళి కాంబో సినిమా రెండు పార్ట్‌లు కలిపి దాదాపుగా అయిదు సంవత్సరాల సమయం తీసుకోనుంది. అంటే మహేష్ బాబు కెరీర్‌లో అయిదు ఏళ్లు పూర్తిగా రాజమౌళికి కేటాయించాల్సి ఉంటుంది.అంటే మహేష్ బాబు 2025 లో రాజమౌళి చేతిలో లాక్ అయిపోయినట్లే.