అన్‌స్టాపబుల్ 4 షో కోసం రామ్ చరణ్ వేసుకున్న హుడీ కాస్ట్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది...!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరిగా త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. త్రిబుల్ ఆర్ తర్వాత కాస్త లాంగ్ గ్యాప్ తీసుకుని త్వరలోనే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. దిల్ రాజు దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా రెండేళ్లకు పైగా సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకొని ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్లలో అందరూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ సీజన్ 4లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ 31 ఎపిసోడ్ షూటింగ్ జరగగా దానికి సంబంధించిన ఫోటోలు .. వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. షో లో బాలయ్య - చెర్రీ కాంబో చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది.
అన్నిటికంటే ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది మాత్రం రామ్ చరణ్ వేసుకున్న హుడీ. సాధారణంగా సెలబ్రిటీలు ఇలా స్పెషల్ లుక్కులో కనిపించారంటే చాలు వెంటనే వాళ్ళు వేసుకున్న షర్ట్స్ - వాచ్ - గాగుల్ ఇలా అన్నింటి ధరలు సోషల్ మీడియాలో సెర్చ్ చేసి ఇట్టే పట్టేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్ షోలో చరణ్ వేసుకున్న హుడీ రేటు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది. ఈ బ్లాక్ హుడీ అమిరి అనే బ్రాండ్ ది కావడం విశేషం. కాటన్ బ్లెండ్ తో మిక్స్ అయ్యి ఉన్న ఈ షర్ట్ పై బ్రాండ్ నేమ్ ఉండడంతో పాటు హ్యాండ్స్ కి సైడ్స్ కి రెడ్ కలర్ లైన్స్ తో డిఫరెంట్ డిజైన్ ఉంది. ఇది చూడడానికి చాలా ఎట్రాక్టివ్ గా ఉంది. ఈ హుడీ రేటు ఏకంగా రూ. 88, 126. నిజానికి దాని ధర అక్షరాలా లక్షకు పైనే అంట. అయితే ఇది ప్రస్తుతం ఆఫర్ లో ఉండడంతో రూ.88 వేలకి ఈ షర్ట్ అందుబాటులో ఉంది.