బాల‌య్య - వ‌సుంధ‌ర పెళ్లి క్యాన్సిల్ అయ్యి మ‌ళ్లీ ఎలా జ‌రిగిందో తెలుసా..!

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కెరీర్ పరంగా వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాల తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో నటించిన డాకు మహారాజ్‌ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బాలయ్య సినిమాలు .. అటు పొలిటికల్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీని మాత్రం భార్య వసుంధర చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మూడున్న‌ర దశాబ్దాలు గా వసుంధర తన ఫ్యామిలీని బాగా చక్కబెడుతూ వస్తున్నారు. వసుంధర పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు బాలయ్య కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అప్పట్లో తన సన్నిహితుడుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చెప్పారు.

ఆయన తనకు తెలిసిన వారి ద్వారా కాకినాడలో మంచి సంబంధం ఉందని ఎన్టీఆర్ కు చెప్పారు. బాలయ్య తో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కొందరు వెళ్లి వసుంధర ను చూశారు. అయితే నాదెండ్ల భాస్కరరావు ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన దాని ప్రకారం ముందుగా ఎన్టీఆర్ కాస్త ఎక్కువగానే కట్నం అడిగారని ... వసుంధ‌ర‌ వైపు వాళ్ళు అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో తిరిగి కాకినాడ సిటీ అవుట్ కట్స్ వరకు వచ్చేసారట. వెంటనే మళ్ళీ ఎన్టీఆర్ ఫోన్ చేసి వెళ్లి సంబంధం ఖాయం చేసుకోమని చెప్పడంతో మళ్లీ వెన‌క్కు వెళ్లి లగ్గం పెట్టుకున్నారట. ఆ రోజుల్లోనే వసుంధరకు పుట్టింటి వైపు నుంచి భారీగా బంగారంతో పాటు కొన్ని స్థిరాస్తులు .. పది లక్షల రూపాయల నగదు ఇచ్చారట. ఆ డబ్బుతోనే ఇప్పు డు జూబ్లీహిల్స్ లో బాలయ్య ఉంటున్న ఇంటిని ఎన్టీఆర్ కొనుగోలు చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: