"ఆడు ఓ పెద్ద వేస్ట్ ఫెలో".. తెలుగు హీరో పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..!?
ఈ విషయాన్ని చాలామంది స్టార్స్ కూడా ఓపెన్ గానే చెప్పారు . రాజమౌళిని ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదు అని దాని వెనక పెద్దతతంగాలు ఎన్నో ఉంటాయి అని చెప్పుకొచ్చారు . కాగా ఇప్పుడు రాజమౌళికి సంబంధించిన ఒక వార్త తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది . రాజమౌళి ఒక పెద్ద స్టార్ హీరో పై చేసిన కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి. చత్రపతి సినిమా తర్వాత రాజమౌళి .. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.." ప్రభాస్ చాలా చాలా మంచోడు అని ..ఫుడ్ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని ..
కానీ ప్రభాస్ చాలా చాలా బద్ధకస్తుడు అని.. సినిమా కోసం ఏదైనా చేస్తాడు కానీ తన పర్సనల్ విషయం వచ్చేసరికి చాలా బద్ధకం బీహేవ్ చేస్తూ ఉంటాడు అని .. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే తనకోసం ఏ పని చేసుకోని ఒక వేస్ట్ ఫెలోనే అని .. చాలా బద్ధకంగా ఉంటాడు అని.. ప్రభాస్ తో ఉన్న చనువు కారణంగా మాట్లాడుతాడు. పక్కనే ఉన్న ప్రభాస్ సైతం " నిజమే నిజమే నిజమే " అంటూ నవ్వుకుంటూ ఉంటాడు . దీనికి సంబంధించిన విషయాన్ని మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అభిమానులు. అఫ్ కోర్స్ రాజమౌళి ఎంతో మంది హీరోలతో సినిమాలను తెరకెక్కించారు . కానీ రాజమౌళి - ప్రభాస్ కాంబోలో సినిమా అంటే మాత్రం వేరే లెవెల్ . అందరికీ ఆ కాంబో ఇష్టమే..!