పుట్టపర్తిలో సాయి పల్లవి రహస్య పూజలు ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ... మన తెలుగు ఇండస్ట్రీలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బాగా సక్సెస్ అవుతున్నారు. అచ్చం అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. హీరోయిన్ సాయి పల్లవి తెలుగు కాకపోయినా మన ఇండస్ట్రీలో ఆమెకు మంచి పేరు ఉంది. అతి తక్కువ కాలంలోనే లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది హీరోయిన్స్ సాయి పల్లవి. అయితే అలాంటి హీరోయిన్ సాయి పల్లవి తాజాగా రహస్య పూజలు చేసుకుంటూ కనిపించింది.
 

ఎవరికీ తెలియకుండా పుట్టపర్తి సాయిబాబా సన్నిధికి వెళ్ళింది హీరోయిన్ సాయి పల్లవి. కొత్త సంవత్సరం అయిన నేపథ్యంలో... అందరూ గుళ్ళు గోపురాలకు వెళ్తున్నారు. అయితే హీరోయిన్ సాయి పల్లవి మాత్రం... ఏపీలో ఉన్న పుట్టపర్తి సాయిబాబా సన్నిధికి వెళ్ళింది. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి మహాసమాధిని... దర్శించుకున్నారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. రెడ్ డ్రస్ వేసుకున్న హీరోయిన్ సాయి పల్లవి... జనాలతో కలిసి పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో ప్రత్యేక పూజలు కూడా చేశారు.
 

ఇక పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో హీరోయిన్ సాయి పల్లవి చేసిన పూజలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన నేపథ్యంలో.... సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెళ్లి కావాలని హీరోయిన్ సాయి పల్లవి ప్రత్యేక పూజలు చేసినట్లు ఉందని... కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం ఆమె... మనసు ప్రశాంతంగా ఉండేందుకు అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారు.
 

ఇది ఇలా ఉండగా.... హీరోయిన్ సాయి పల్లవి... ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా చేయగా హీరోయిన్గా సాయి పల్లవి చేసింది. ఈ సినిమాతో వరుణ్ తేజ తో పాటు సాయి పల్లవి ఇద్దరు కూడా హిట్ కొట్టారు. ఇక ప్రస్తుతం నాగచైతన్యతో.... హీరోయిన్ సాయి పల్లవి సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే తండెల్. సముద్ర నేపథ్యం లో ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది  రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: