సినీ స్టార్స్ కి ఉ* పడిపోయేలా చేస్తున్న రేవంత్ రెడ్డి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు..!
అయితే రేవంత్ రెడ్డి మాత్రం టికెట్ రేట్లు పెంచను..బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వను అంటూ ఖరాకండిగా చెప్పేశారు. మిగతా ఏ విషయానికైనా సరే ఇండస్ట్రీకి ప్రభుత్వం సహాయపడుతుంది అని.. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండేటటువంటి విషయాలకు ప్రభుత్వం అస్సలు సపోర్ట్ చేయదు అంటూ తేల్చి చెప్పేశాడు. అయితే అల్లు అర్జున్ పై జరుగుతున్న ఇష్యూలో రేవంత్ రెడ్డి స్పందించారు. " నేనేదో కావాలని అల్లు అర్జున్ పై పగ పట్టి ఏదో ఈవెంట్లో నా పేరు చెప్పలేదన్న కోపంతోనే ఇలా చేస్తున్నాను అని నోటికొచ్చినట్లు వాగుతున్నారు అని .. అలాంటిది ఏదీ లేదు అని.. ఏ హీరో నా పేరు చెప్పనంత మాత్రాన నాకు ఉండేది పోదు.. పోయేది రాదు అని .. అల్లు అర్జున్ రామ్ - చరణ్ - రానా అందరు నా కళ్ళ ముందే పెరిగి పెద్దయ్యారు అని.. అలాంటి వారిపై నాకు ఎందుకు ద్వేషం ఉంటుంది..? అని చెప్పుకొచ్చారు.
"ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ నే ప్రభుత్వం ప్రభుత్వమే.. మా ప్రభుత్వం సామాన్య ప్రజల కోసమే ఆలోచిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ". అయితే సినిమా ఇండస్ట్రీ సభ్యులకు చెమటలు పట్టించేస్తూ పరుగులు తీయిస్తున్న రేవంత్ రెడ్డి ఫేవరెట్ హీరో ఎవరు అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతుంది . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఆయన ఫేవరెట్ హీరో ఎవరు అన్న విషయాన్ని బయటపెట్టారు . "సూపర్ స్టార్ కృష్ణ అంటే రేవంత్ రెడ్డికి చాలా చాలా ఇష్టమట. చిన్నప్పటినుంచి ఆయన సినిమాలు చూసే పెరిగారట ". ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టాడు రేవంత్ రెడ్డి . నిర్మాతలు నష్టపోతే కృష్ణ పారితోషకం తీసుకోకుండానే వాళ్లకు బోలెడు సినిమాలు చేసి పెట్టేవారు అని .. సంవత్సరానికి 15 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని.. ఆయన వల్ల థియేటర్స్ కళకళలాడేటివి అని .. ఆ కారణంగా వ్యాపారులు కూడా బాగుండేవారు అని చెప్పుకొచ్చారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఫేవరెట్ హీరో సూపర్ స్టార్ కృష్ణ అన్న విషయం బాగా హైలైట్ గా మారింది..!