మొదటిరోజు "మన శంకర వరప్రసాద్ గారు" మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఇవే..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే ఫ్యామిలీ ప్లేస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను నిన్న అనగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు అనగా జనవరి 11 వ తేదీన రాత్రి నుండి అనేక ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్స్ కు మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ మొదటి రోజు కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతో కలిపి ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు.
 


ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతో కలిపి 84 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు అద్భుతమైన టాక్ రావడంతో ఈ మూవీ కి రెండవ రోజు కూడా భారీ కలెక్షన్లు దక్కే అవకాశం ఉంది అని , అలాగే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: