జిల్లాలు ముట్టుకుంటే.. అగ్ని రగులుతుంది.. రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ను ప్రజలు బొంద పెట్టేస్తారని ఆయన జోస్యం చెప్పారు. కొడంగల్ సహా పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హామీలు పథకాల అమలు గురించి ప్రశ్నిస్తే దూషణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ అదృష్టం బాగుండటం వల్ల సీఎం అయ్యారని కేటీఆర్ సెటైర్ వేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్లీ తప్పు చేయకుండా కారు గుర్తుకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి ప్రకటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చను రేపాయి. విశ్రాంత జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాలు మండలాలు పునర్విభజన చేస్తామని ఆయన చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా జిల్లాలు ఏర్పాటు చేసిందని రేవంత్ విమర్శించారు. సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. కమిషన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాచకొండ కమిషనరేట్ పేరు మార్చడం రాచరిక పాలనకు గుర్తుగా ఉందని వివరించారు.
సికింద్రాబాద్ విషయంలో తాను వచ్చాక ఎలాంటి మార్పు చేయలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జిల్లా కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని రేవంత్ ప్రకటించారు. ఈ పునర్విభజన రాష్ట్ర అభివృద్ధికి సమతుల్యత తెస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.కేటీఆర్ విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. జిల్లాల పునర్విభజన తేనె తుట్టె కదిలించినట్టుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదని జూపల్లి చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.