నైజాం ఏరియాలో ఏకంగా ఆ పాన్ ఇండియా మూవీనే లేపేసిన మన శంకర వరప్రసాద్ గారు..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి కి నైజాం ఏరియాలో అదిరిపోయే రేంజ్ లో మార్కెట్ ఉంది. ఇది వరకు చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు నైజాం ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించాడు. నయనతార ఈ సినిమాలో చిరంజీవి కి జోడి గా నటించగా షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహు గరపాటి , సుస్మిత కొణిదల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ని నిన్న అనగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను జనవరి 11 వ తేదీన రాత్రి నుండి చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు.


ఈ సినిమాకు సూపర్ సాలిడ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ నైజాం ఏరియాలో ఏకంగా ఓ భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఓ పాన్ ఇండియా మూవీ మొదటి రోజు కలెక్షన్లనే దాటేసింది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి 2 సినిమా వచ్చి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 8.9 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. తాజాగా విడుదల అయిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నైజాం ఏరియాలో మొదటి రోజు 9.30 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి బాహుబలి 2 సినిమాను క్రాస్ చేసేసింది. మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కి సూపర్ సాలిడ్ టాక్ రావడంతో ఈ మూవీ అదిరిపోయే రోజు కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: