శాంతానుతో బ్రేకప్..ఆ వ్యక్తితో పెళ్లికి రెడీ అయిన శృతిహాసన్..?

Pandrala Sravanthi
శృతిహాసన్.. ఎఫైర్ల పుట్టగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలు పక్కన పెడితే ఆమె పెట్టుకున్న రిలేషన్స్ ద్వారానే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది.ఇక ఎంతోమంది హీరోలకు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.. చాలామంది ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు ఈ హీరోయిన్ హిట్స్ ఇవ్వడంతో ఈ హీరోయిన్ కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది తన ప్రియుడు శాంతాను హజరికతో బ్రేకప్ చెప్పుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రేమ గురించి శృతిహాసన్ షాకింగ్ కామెంట్లు చేసింది. శృతిహాసన్ మాట్లాడుతూ.. గతంలో నేను అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. 

కానీ ప్రస్తుతం నా నిర్ణయం మారింది. భవిష్యత్తులో మంచి వ్యక్తి దొరికితే ఖచ్చితంగా నేను కూడా పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కొంతమంది పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు.వారిని చూసినప్పుడు నాకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు. పెళ్లి కంటే ఎక్కువగా ఎదుటివారితో రిలేషన్ లో ఉండి రొమాంటిక్ గా ఉండడం అంటే చాలా ఇష్టం. అందుకే నేను నాతో ఉండే ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండడానికి ట్రై చేస్తాను..

జీవితం ఒకేలా ఎప్పటికీ ఉండదు. ప్రతిసారి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అలా పెళ్లి అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. కాబట్టి భవిష్యత్తులో నాకు సరైన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లిపై నాకు మంచి అభిప్రాయమే ఉంది అంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది.ఇక శృతిహాసన్ పెళ్లి కంటే ఎక్కువగా రిలేషన్స్ లోనే ఉండడం ఇష్టం అని చెప్పడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.అలాగే త్వరలోనే ఈ ముద్దుగుమ్మ మళ్లీ తన మనసుకు నచ్చిన వాడితో డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంటుంది అని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: