జానీ మాస్టర్ కు షాక్..! చార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సేకరించిన ఆధారాలతో పోలీసులు జానీ మాస్టర్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడులు చేసినట్టు తెలుస్తోంది. దీంతో అంతా ముగిసి పోయిందనుకున్న సమయంలో మరోసారి జానీ మాస్టర్ కు షాక్ తగిలిందనే చెప్పుకొవాలి.
ఇక లైంగిక ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా సెప్టెంబర్ 19న జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అసిస్టెంట్ పై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్.. 36 రోజుల పాటు చంచల్ గూడా జైల్లోనే ఉన్నారు. దీంతో ఆయనకు వచ్చే నేషనల్ అవార్డు కూడా కమిటీ రద్దు చేసింది. ఎట్టకేలకు జానీ మాస్టర్ కు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. ఇక జైలు నుంచి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.