18 ఏళ్లకే పెళ్లి విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. బడా బిజినెస్ మాన్ తో రెండో పెళ్లి..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలోనే టాప్ సింగర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది .. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన అద్భుత గాత్రంతో అదరగొట్టింది .. కానీ తన నిజ జీవితం మాత్రం ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది .. 18 సంవత్సరాలకి పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టి.. ముగ్గురు పిల్లల తల్లిగా తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది కానీ మొదటి పెళ్లి ఎక్కువ రోజులు నిలవలేదు .. ఆ తర్వాత మరోసారి పెళ్లి చేసుకుంది .. ఇప్పుడు 43 సంవత్సరాల వయసులో ఓ బిజినెస్ మాన్ తో ఏడు అడుగులు వేసేందుకు రెడీ అవుతుంది .. ఇంతకీ ఈ టాప్ సింగర్ ఎవరు అనే విషయాలు ఇక్కడ చూద్దాం.

ఇంతకీ ఆ టాప్ సింగర్ మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కనిక కపూర్ .. చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది .. కెరియర్ మొదటిలోనే 1988లో 18 సంవత్సరాల వయసులోనే రాజ్ చంద్రలోక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది .. ఈ జంట‌కి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు .. కానీ వీరిద్దరూ మనస్పదలతో 2012లోనే విడాకులు తీసుకున్నారు .. తర్వాత పిల్లలతో కలిసి ఒంటరిగా జీవించింది కనిక .. తర్వాత మళ్లీ 2022లో బడా వ్యాపారవేత్త గౌతం హథీరమణిని పెళ్లి చేసుకుంది .. దాంతో ఇప్పుడు ఈమెని ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

2022లో రెండో పెళ్లిని లండన్ లో చేసుకుంది .. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది . తన రెండో భర్తతో దాదాపు 15 సంవత్సరాలుగా స్నేహం ఉందని .. చాలాకాలం కలిసి గడిపిన తర్వాతే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఆలోచనకు వచ్చామని గతంలో క‌నిక ఓ ఇంటర్వ్యూలో చెప్పికొచ్చింది .. అయితే 2014లో గౌతమ్ తనకు ప్రపోజ్ చేశాడని .. ఆ తర్వాత 2020లో మరోసారి పెళ్లి గురించి చెప్పాడని.. తర్వాత రెండు సంవత్సరాలకి మేము ఇద్ద‌రం పెళ్లి చేసుకున్నామని ఈ సీనియర్ బ్యూటీ చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: