చిరు వల్ల మోహన్ బాబుకి రెండు బ్లాక్ బస్టర్.. అసలు జరిగింది ఇదే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి తన కెరియర్ లో చాలా సినిమాలను వదులుకున్నాడు. అలా వదులుకున్న సినిమాలలో రెండు సినిమాల్లో మోహన్ బాబు హీరోగా నటించగా ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. మరి ఆ సినిమాలు ఏవి ..? ఎందుకు చిరంజీవి ఆ రెండు సినిమాలను రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

మోహన్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం అల్లుడు గారు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు రాఘవేందర్రావు దర్శకత్వం వహించాడు. రాఘవేందర్రావు మొదట ఈ సినిమాను చిరంజీవి తో చేయాలి అనుకున్నాడట. కానీ కథ మొత్తం పూర్తి అయ్యాక క్లైమాక్స్ లో హీరో చనిపోయే సన్నివేశం ఉండడంతో అది చిరంజీవితో వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఆ సినిమా నుండి చిరంజీవిని తప్పించి మోహన్ బాబును హీరోగా తీసుకున్నారట. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ బాబు "అసెంబ్లీ రౌడీ" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు బి గోపాల్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఓ సినిమాకు రీమేక్ గా రూపొందింది. బి.గోపాల్ ఈ సినిమాను మొదట తెలుగు లో చిరంజీవితో రీమిక్ చేయాలి అనుకున్నాడట.

అందులో భాగంగా చిరంజీవి కి కథను వివరించగా చిరంజీవి మాత్రం ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదట. దానితో మోహన్ బాబుకు ఈ సినిమా కథను వివరించగా ఆయన మాత్రం ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట. ఇక అసెంబ్లీ రౌడీ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా చిరంజీవి తో అనుకున్నా ఈ రెండు సినిమాలు మోహన్ బాబు తో రూపొందించగా ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: