అంతులేని టాలెంట్ కి ఆ మాత్రం బలుపు అలంకారమే.. అల్లుఅర్జున్ పై నటి షాకింగ్ పోస్ట్..!!

murali krishna
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్‌గా మారారు. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈక్రమంలో రేవతి అనే ఓ మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి.ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫైర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్ట్‌ల మధ్య అల్లు అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చారు. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్‌తో పాటు, ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్‌కు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోనని తేల్చిచెప్పారు.రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది.అయితే సంధ్య థియేటర్ దగ్గర ఘటనలో అల్లు అర్జున్‌ తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా అల్లు అర్జున్‌పై అర్జున్ రెడ్డి నటి శ్రీ సుధ తనదైనశైలిలో స్పందించారు. అల్లు అర్జున్‌‌లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదని క్యాప్షన్ పెట్టి తగ్గేదెలా అని అల్లు అర్జున్ మ్యానరిజం‌ను షేర్ చేసింది.అలాగే సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసింది.గురుకులాల్లో విద్యార్థులు చనిపోయిన పేపర్ కటింగ్‌ను షేర్ చేసింది. ఈ పిల్లల ప్రాణాల గురించి పట్టించుకోరు కానీ అల్లు అర్జున్ గురించి మాట్లాడతారా అనే విధంగా ఆమె పోస్ట్ ఉంది.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: