పుష్ప 2 మూవీ బెన్ఫిట్ షో చూసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కి వెళ్లిన సంగతి తేలిసిందే . కానీ అక్కడ అభిమానుల మధ్య తోపులాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఆస్పత్రిలో చేర్చారు. రేవతి భర్త ఫిర్యాదుతో తొలుత థియేటర్ ఓనర్, మేనేజర్, సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఒకటి రెండు రోజుల తర్వాత అల్లు అర్జున్‌ని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఆ రాత్రికే బెయిల్ వచ్చింది. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరైంది. కానీ బన్నీని జైలు నుంచి ఉదయం రిలీజ్ చేశారు.జైలు నుంచి విడుదలై ఇంటికెళ్లిన తర్వాత సినీ ప్రముఖులు చాలామంది అల్లు అర్జున్‌ని పరామర్శించారు. తాజాగా ఆ విషయంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆస్పత్రిలో ఉన్న పిల్లాడిని ఒక్కరు కూడా పరామర్శించలేదని, బన్నీని మాత్రం కలిశారని అన్నారు. తప్పంతా బన్నీదే అన్నట్లు రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీంతో అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్, తానేం తప్పు చేయలేదని, ప్రమాదం వల్ల మహిళా చనిపోయిందని అన్నాడు.
ఇప్పుడు పోలీసులు. మరోసారి బన్నీని విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది.ఈ క్రమంలో అల్లు అర్జున్ మరోసారి పోలీసుల ముందుకు హాజరు కానున్నారు. సంధ్య థియేటర్ దగ్గర మహిళా మృతి చెందిన కేసులో ఇదివరకే అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకొచ్చిన బన్నీ మరోసారి విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి తన లాయర్లతో భేటీ అయిన అల్లు అర్జున్ వాళ్లతో కలిసి ఈ రోజు అనగా డిసెంబర్ 24 ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రానున్నాడు.విచారణలో భాగంగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి జరిగిన విషయాల గురించి పోలీసులు మాట్లాడుతారు. అలానే అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని తెలుస్తోంది. అలాగే సీన్ ఆఫ్ ఆపెన్స్ కోసం అవసరమైతే సంధ్య థియేటర్‌కు రావాల్సి ఉంటుందని పోలీసులు నిన్న బన్నీకి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ దాదాపు పది ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని సమాచారం. ఇది విచారణ కాబట్టి మధ్యాహ్నానికి తిరిగి బన్నీ ఇంటికి వెళ్లిపోతాడు.