టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథ రచయితగా పని చేసి తన మార్క్ ఏమిటో చూపించుకున్నాడు. ఆ తర్వాత మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి మూవీతోనే మంచి విజయాన్ని అందుకొని కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇకపోతే కొరటాల శివ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 1 అనే సినిమాను రూపొందించాడు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి సక్సెస్ను అందుకుంది.
ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఈ సినిమాకు కొనసాగింపుగా దేవర పార్ట్ 2 సినిమాకు సంబంధించి పెద్దగా అప్డేట్లు ఏమీ రాలేదు. ఇకపోతే తాజాగా కొరటాల శివ "దేవర పార్ట్ 2" సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేవర పార్ట్ 2 కు సంబంధించిన మెయిన్ కథ రెడీగా ఉన్నా మొదటి భాగం మంచి విజయం సాధించడంతో దాని స్కేల్ ను మరింత పెంచేందుకు ఈ సినిమా కథ విషయంలో కొరటాల మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమ నుండి వస్తున్న సీక్వెల్ మూవీస్ కి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. బాహుబలి మూవీ కి సిక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 భారీ కలెక్షన్లను వసూలు చేసి కొత్త కొత్త రికార్డులను సృష్టించింది.
పుష్ప మూవీ కి కొనసాగింపుగా వచ్చిన పుష్ప పార్ట్ 2 మూవీ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా అనేక రికార్డులను సృష్టించింది. ఇక దేవర మూవీ కి కొనసాగింపుగా రాబోయే దేవర పార్ట్ 2 మూవీ కూడా అనేక కొత్త రికార్డులను సృష్టిస్తుంది అని తారక్ అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.