ఏపీ: సంక్రాంతి అంటే భయపడుతున్న చంద్రబాబు.. ఎమ్మెల్యేలకు వార్నింగ్..!
సంక్రాంతి పండుగ కేవలం మరో మూడు వారాలు మాత్రమే ఉన్న సమయంలో ఇంకా గుంతలు ఉన్న రోడ్లను సైతం గుర్తించి రిపేర్లు చేయాలని కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారట. సంక్రాంతికి వచ్చేవారు ఎక్కడైనా సరే రోడ్లు బాగాలేదని సోషల్ మీడియాలో పెడితే కచ్చితంగా ఆ ఎమ్మెల్యేల నియోజవర్గానిదే బాధ్యత అంటూ కూడా వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వెంటనే ఆయా నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు కూడా గుంతలు లేని రోడ్లు కోసం పరుగులు పెడుతున్నట్లుగా సమాచారం.
వైసిపి ప్రభుత్వం చేసిన తప్పులను తాము చేయమంటూ పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి బాగాలేదని కూటమి ప్రభుత్వమే ఎద్దేవా చేసింది. ఇప్పుడు మరి అధికారంలోకి వచ్చినా కూడా వీటి గురించి పట్టించుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన సీఎం చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి సంక్రాంతి అంటే మినిస్టర్లకు ,ఎమ్మెల్యేలను భయపెట్టేలా చేశారు సీఎం చంద్రబాబు. అయితే ముందుగా రోడ్లను రిపేరు చేసిన తరువాతే కొత్త రోడ్డును వేయించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఇతర విషయాలలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు సైతం హద్దులు దాటుతూ ఉన్నట్లుగా కనిపించడంతో వారందరినీ పిలిచి కూడా సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నట్లు సమాచారం.