హెరాల్డ్ ప్లాష్‌బ్యాక్ 2024: పవన్‌ కెరీర్‌ మార్చేసిన రమణ గోకుల ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సంగీత దర్శకులు ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది సంగీత దర్శకులు... ప్రతి సినిమాతో హిట్ కొడుతున్నారు. మరి కొంతమంది... నాలుగు సినిమాలు చేస్తే రెండు సినిమాలు హిట్ అవుతున్నాయి. అయితే అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగీత దర్శకులలో... రమణ గోకుల ఒకరు. మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాటలు అంటే ఇప్పటికీ చాలామంది పడి చస్తారు.

ఆయన ఇచ్చే మ్యూజిక్, అందర్నీ ఆకట్టుకుంటుంది. అప్పట్లో... ప్రేమంటే ఇదేరా, తమ్ముడు, బద్రి, యువరాజు, జానీ, అన్నవరం లాంటి ఎన్నో సినిమాలకు... సంగీత స్వరాలు అందించారు రమణ గోకుల. ఆయన ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు మ్యూజిక్ అందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కు మ్యూజిక్ అందించిన ప్రతి సినిమా హిట్ అయింది.

దాంతో రమణ గోకులకు మంచి పాపులారిటీ వచ్చింది. అయితే 2013 సంవత్సరం నుంచి... ఇండస్ట్రీకి దూరమయ్యారు రమణ గోకుల. 2013 సంవత్సరంలో వెయ్యి అబద్ధాలు  సినిమా కు మ్యూజిక్ అందించారు రమణ గోకుల.  ఈ సినిమా తర్వాత మళ్లీ ఆయన కనిపించలేదు   దేవిశ్రీప్రసాద్ అలాగే తమన్ లాంటివారు ఇండస్ట్రీని ఏలుతున్న నేపథ్యంలో... రమణ గోకులకు పెద్దగా అవకాశాలు రాలేదు.

అయితే దాదాపు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత... టాలీవుడ్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు రమణ గోకుల. విక్టరీ వెంకటేష్ హీరోగా తాజాగా చేస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో గోదారి గట్టు  పాట పాడి.. మళ్లీ ఒకసారి ఆయన టాలెంట్ ప్రూఫ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తోంది. వ్యక్తిగత కారణాలవల్ల ఆయన కొన్ని రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారట. ఈ గ్యాప్ లో అమెరికాలో జీవితాన్ని గడిపారట. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలలో... చేసేందుకు రెడీ అయినట్లు ఆయన తాజాగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: