పెళ్లయిన మూడు రోజులకే.. మళ్లీ మొదలెట్టిన కీర్తి సురేష్.. ఆ హీరోతో కలిసి?
ఇక అసలు విషయంలోకి వెళితే... చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి అయిన తర్వాత వర్క్ నేపథ్యంలో తాళిబొట్టు లేకుండానే బయటకు వెళతారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో పెళ్లయిన ఏ హీరోయిన్ కూడా తాళిబొట్టుతో అస్సలు కనిపించదు. కానీ తాజాగా కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ముంబైలో జరిగిన ఓ పార్టీకి మోడ్రన్ డ్రెస్సులో వెళ్లడమే కాకుండా మెడలో తాళిబొట్టుతో వెళ్లడం విశేషం. దీంతో కీర్తి సురేష్ మోడ్రన్ డ్రెస్ లో మంగళసూత్రంతో కనపడిన వీడియోలను బాలీవుడ్ మీడియా తెగ వైరల్ చేస్తుంది.
విషయం ఏమిటంటే... కీర్తి సురేష్ నటించిన మొదటి బాలీవుడ్ సినిమా "బేబీ జాన్" డిసెంబర్ 25న చాలా గ్రాండుగా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కోసం కీర్తి ముంబై వెళ్లడం జరిగింది. అయితే పెళ్ళై కొన్ని రోజులకే కీర్తి అలా సినిమా ప్రమోషన్లో పాల్గొనడం చూసి చాలామంది సినిమాల పట్ల ఆమెకున్న డెడికేషన్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక కీర్తి పెళ్లి తర్వాత పార్టీకి ఇలా తాళిబొట్టు కనిపించి బాలీవుడ్ లో వైరల్ కావడం పట్ల భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఆమెని అభినందిస్తుంటే, మరికొంతమంది రీసెంట్ గానే కదా పెళ్లి అయింది... అందుకే అలా వేసుకుంది అని, కొంతమంది ఆ మోడ్రన్ డ్రెస్ మీద తాళిబొట్టు అవసరమా? అని కామెంట్స్ చేస్తున్నారు.