అరెస్ట్ విషయంలో బన్నీ ఫ్యూజులు ఎగిరిపోయే నిర్ణయం.. ఇప్పుడు కధలో అసలు ట్విస్ట్..!?
1409 కోట్లు కలెక్ట్ చేసింది. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డ్ ని నెలకొల్పింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ ని తిరగ రాసింది . అయితే ఎవరు ఊహించని విధంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడం.. దానికి ప్రధాన నిందితుడిగా అల్లు అర్జున్ అంటూ భావించి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది . నాంపల్లి కోర్ట్ 14 రోజులు రిమాండ్ విధిస్తే ..హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది . అయితే తెలంగాణ పోలీసులు మాత్రం అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అంటూ స్ట్రాంగ్ గా వాదిస్తున్నారు .
ఏ క్షణాలైనా అల్లు అర్జున్ అరెస్ట్ రావచ్చు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ తన అరెస్ట్ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా .. తన నెక్స్ట్ సినిమా విషయాల గురించి ఫుల్ గా ఫోకస్ చేస్తున్నారు అంటున్నారు టాక్ న్వినిపిస్తుంది. అంతేకాదు అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో కమిట్ అయ్యారు.
అందుతున్న సమాచారం ప్రకారం జనవరి రెండవ వారంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారట . నిజానికి అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత వెకేషన్ కి వెళ్ళాలి అంటూ ప్లాన్ చేశారట . కానీ అల్లు అర్జున్ అరెస్టు అవ్వడంతో ఫ్యామిలీ బాగా డిసప్పాయింట్ అవ్వడంతో ఆ వెకేషన్ క్యాన్సిల్ చేసి మరి అల్లు అర్జున్ ఇంట్లోనే టైం స్పెండ్ చేసి జనవరి 2వ వారంలో తన నెక్స్ట్ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి సెట్స్ పైకి తీసుకుని రాబోతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్గా మారింది. అల్లు అర్జున్ ట్రోలర్స్ కి ఫ్యుజులు ఎగిరిపోయేలా నిర్ణయం తీసుకున్నాడు అని ..ఇప్పుడు కథలో భారీ భారీ ట్విస్ట్ లు వస్తాయి అని ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు..!