ప్చ్: ఇకపై మహేష్ బాబుని ఆ పేరుతో పిలవలేం.. ఎందుకంటే..?

Thota Jaya Madhuri
మహేష్ బాబు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అందం . ముట్టుకుంటే మాసి పోతుంది ఏమో అనేటటువంటి అందం. చాలా చాలా హ్యాండ్ సమ్ బాయ్. సాఫ్ట్ బాయ్.. మిల్కీ బాయ్ ..కరెక్ట్ అందరు ఇవే మాట్లాడుకుంటారు . అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబుని ఇకపై ఆ పేరుతో పిలవలేమంటున్నారు అభిమానులు.  దానికి కారణం రాజమౌళి మహేష్ బాబుని సాఫ్ట్ బాయ్ కాదు రూడ్ బాయ్ గా మార్చయబోతున్నారట . మనకు తెలిసిందే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఎలాంటి టాక్ అందుకుందో.


ఆ మూవీలో నటించిన తరువాత ఎంత ట్రోలింగ్ కి గురయ్యారో అందరికీ తెలిసిందే . అయితే చాలా గ్యాప్ తర్వాత మహేశ్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఎప్పుడు సినిమాలు ఓకే చేస్తాడు..? అంటూ ఎప్పటినుంచో ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఫైనల్లీ అమౌంట్ వచ్చేసింది . మరి ముఖ్యంగా రెండు పార్ట్లు గా ఈ సినిమాని తెరకెక్కించబోతూ ఉండడం గమనార్హం. బాహుబలి తర్వాత రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న మూవీ ఇదే .

 
ఈ సినిమా కోసం ఏఐ టెక్నాలజీని కూడా బాగా ఉపయోగించబోతున్నాడట . రాజమౌళి - మహేష్ బాబుని సినిమాలో చాలా చాలా రూడ్ ..రగ్డ్ లుక్ లో చూపించబోతున్నారట.   మహేష్ బాబును మాస్ రగ్డ్ లుక్ లో చూపించబోతున్నారట . అంతేకాదు కొన్ని కొన్ని షాట్స్ లో మహేష్ బాబుని అసలు మహేష్ బాబు అనే విధంగానే ఊహించుకోని విధంగా చూపించబోతున్నారట . చాలా రూడ్ అండ్ రగ్డ్ గా ఆయన క్యారెక్టర్ ఉండబోతుందట. దీంతో ఫాన్స్ ఇక మహేష్ బాబుని సాఫ్ట్ బాయ్ అని పిలవలేమని రాజమౌళి సినిమా తర్వాత కొత్త ట్యాగ్ మహేష్ బాబుకి వస్తుంది అంటూ ట్రెండ్ చేస్తున్నారు.  జనవరి మొదటి వారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: