మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా .. తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడుగా..!

Amruth kumar
ఇక చిత్ర పరిశ్రమలో ఉండే ప్రతి హీరో , హీరోయిన్ కి డ్రీమ్ రోల్ అనేది కచ్చితంగా ఉంటుంది .. ఆ పాత్రలో నటిస్తే బాగుంటుంది అలాంటి అవకాశాలు వస్తే బాగుంటుందని వారు ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు .. అలాంటి అవకాశాలు వస్తే వారు అసలు  నో చెప్పడానికి ముందుకు రారు .. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న మ్యాన్ ఆఫ్ మాస్‌ ఎన్టీఆర్ కు డ్రీమ్ రోల్ ఉందని తెలుస్తుంది .. తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు నట వారసుడిగా  బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా తానేంటో ఇప్పటికే నిరూపించాడు.

 
ఎలాంటి పాత్ర అయినా తన అద్భుతమైన నటనతో న్యాయం చేయగలడు ఎన్టీఆర్ .. రీసెంట్ గానే దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు .. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీలో నటిస్తున్నాడు .. ఈ సినిమా వచ్చే ఆగస్టు 15 కనుకగా ప్రేక్షకుల ముందుకు రాభోతుంది . అయితే ఇప్పుడు ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది .. ఎన్టీఆర్ ఎప్పటినుంచో ఆ పాత్రలో నటించడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది.

 
ఇన్ని సంవత్సరాల తన కెరీర్లో ఇప్పటివరకు అలాంటి పాత్రలో నటించే అవకాశం మాత్రం రాలేదని కూడా తెలుస్తుంది ..  ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటనే విషయానికి వస్తే.. ఎన్టీఆర్ తాతగారు నందమూరి తారకరామారావు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించారు. తన తాత గారిని కృష్ణుడు భీముడు , భీముడు , దుర్యోధనుడు , రావణుడు వంటి పాత్రలో చూసిన ఎన్టీఆర్ ఎంతో సంతోషపడేవారని సమాచారం. తానుకూడా ఇలాంటి పాత్రల‌లో నటించాలని కోరుకునేవాడట. ఇప్పుడు ఎన్టీఆర్ దుర్యోధనుడు లేత భీముడు పాత్రలో నటించాలని ఎంతో ఆశగా ఉండేవాడట.   గతంలో ఎన్టీఆర్ నటించిన పలు సినిమాల్లో కూడా దుర్యోధనుడు .. త్వరలో తెరకెక్కబోయే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి మహాభారతంలో ఎన్టీఆర్ కృష్ణుడిపాత్ర దక్కించుకుంటారో లేదో వేచి చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: