ఆర్జీవీ: బన్నీ-రేవంత్ అరెస్ట్ వీడియోలో కామన్ పాయింట్ అదే.?

frame ఆర్జీవీ: బన్నీ-రేవంత్ అరెస్ట్ వీడియోలో కామన్ పాయింట్ అదే.?

FARMANULLA SHAIK
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అప్పటినుంచి సోషల్ మీడియా వేదికగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా పోస్టులు చేస్తూ వార్తల లో నిలుస్తున్నారు.అయితే తాజాగా ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన ఒక వీడియోని కూడా సోషల్ మీడియా లో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఈయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. సినిమా ఫంక్షన్లలో తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే హీరో హీరోయిన్లను అరెస్టు చేస్తారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు, పుష్కరాల సమయం లో తొక్కిసలాట జరిగిపోతే రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారా అంటూ వరుస ప్రశ్నలు వేస్తూ ఈయన పోస్టులు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఈయన గతం లో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినటువంటి ఒక వీడియోని షేర్ చేశారు.. ఓటుకు నోటు కేసులో భాగంగా రేవంత్ రెడ్డిని పోలీసులు ఏకంగా బెడ్ రూమ్ లోకి వెళ్లి మరి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వీడియోని వర్మ పోస్ట్ చేస్తూ.. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అరెస్టు విషయం లో కామన్ పాయింట్ ఏంటి అంటూ ఈయన ప్రశ్న వేస్తూ పోస్ట్ చేశారు.ఇక ఈ ప్రశ్నకు ఆయనే సమాధానం చెబుతూ వారిద్దరూ తమ బెడ్ రూమ్ లో ఉన్నప్పుడే అరెస్టయ్యారు అంటూ ఆయనే సమాధానం చెప్పుకువచ్చారు. దీంతో వర్మ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ డ్రెస్ మార్చుకొని వస్తానని పోలీసులను చెప్పగా పోలీసులు కూడా అల్లు అర్జున్ తో పాటు తన బెడ్ రూమ్ వరకు వెళ్లారని ఈ విషయంపై అల్లు అర్జున్ కూడా మండిపడిన విషయం మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

rgv

సంబంధిత వార్తలు: