సూపర్: గేమ్ ఛేంజర్ సినిమా ఓటిటి విడుదల ఫిక్స్..!

frame సూపర్: గేమ్ ఛేంజర్ సినిమా ఓటిటి విడుదల ఫిక్స్..!

Divya
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఈనెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటించింది. అలాగే మరొక హీరోయిన్ అంజలి కూడా ఇందులో అద్భుతమైన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా మొదటి షో నుంచి కొంతమేరకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా పెద్దగా రాబట్టలేదు.


అయితే రామ్ చరణ్ అభిమానులకు మాత్రం గేమ్ ఛేంజర్ సినిమా బాగా నచ్చేసింది. అయితే ఇప్పుడు ఎప్పుడెప్పుడా ఈ సినిమా ఓటీటిలో ఎప్పుడు విడుదలవుతుందా అని చాలామంది ఫ్యాన్స్  ఎక్సైటింగ్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా థియేటర్లో  విడుదలైన తర్వాత 5 వారాలు పూర్తి అయిన తర్వాతే ఓటీటీలో విడుదల చేసేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ప్రముఖ ఓటీటి ప్లాట్ఫాములలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ గేమ్ ఛేంజర్ సినిమా ఓటిటి హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా స్ట్రిమింగ్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయట.


మరి మొత్తానికి ఓటీటి లో ఏ విధంగా అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి థియేటర్లో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో వచ్చినప్పటికీ ఓటీటిలో మెప్పించి సక్సెస్ చేస్తారేమో చూడాలి.. చాలా సినిమాలు థియేటర్లో ఆకట్టుకోలేకపోయిన ఓటీటీ లో మెప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సుమారుగా మూడేళ్లపాటు ఈ సినిమా కోసం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కష్టపడ్డారు. దిల్ రాజు కూడా ఈ సినిమాకి భారీ బడ్జెట్ తోనే నిర్మించగా.. మరి ఏ మేరకు కలెక్షన్స్ వచ్చాయి అనే విషయం తెలియాల్సి ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబుతో తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: