ఏపీ: వైసీపీకి డెడ్ లైన్ విధించిన జగన్..?

Divya
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో ఘోర ఓటమితో చాలామంది నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా కార్యకర్తలను అధికారం ఉన్నప్పుడు పట్టించుకోలేదని వాదనలు ఎక్కువగా వినిపించాయి. దీంతో ఈసారి ఎలాగైనా కార్యకర్తల గెలుపు కోసమే తాను గెలవాలని ఉద్దేశంతో పట్టుపడుతున్నారు. 2029 ఎన్నికలకు ముందే కొన్ని కీలకమైన బాధ్యతలను వైసీపీలో ఉండే నేతలకు అప్పగించారు. వైసిపి అనుబంధ సంఘాలకి డెడ్ లైన్ విధించినట్టుగా తెలుస్తోంది.

అయితే గతంలో అనుబంధ సంఘాలకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్వీనర్ గా ఉండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భాస్కర్ రెడ్డిని  జైల్లో పెట్టడంతో అనుబంధ సంఘాల పని సైలెంట్ అయ్యిందని ఈ విషయంలో జగన్ ఏం చేయలేరు అనుకున్న  సందర్భంలో, ఆ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వహిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. అంతేకాకుండా జగన్ ఇచ్చిన పనిని తాను విధించిన డెడ్ లైన్ లోపు ఆ పని పూర్తి చేయాలని తెలిపారు.


దీంతో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ఇచ్చిన ఆ పనిని పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. 2026 ఉగాది నాటికి రాష్ట్రంలో ఉండే ప్రతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర ఒక డిజిటల్ ఐడి కార్డు ఉండాలని, అతను వైసిపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనే విధంగా గుర్తించేలా ఉండాలని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాలలో  ప్రతి బూత్  కమిటీ చేతిలో ఆ బూత్ కు సంబంధించినటువంటి కార్యకర్త వివరాలను ఉంచేలా చూడాలని ప్లాన్ చేశారు. అయితే అది సక్సెస్ అవుతుందా లేదా అన్నటువంటి అంశం మాత్రం రాబోయే రోజుల్లో చూడాలి.



ఇప్పటికే జగన్ కార్యకర్తల కోసం ప్రత్యేకించి డిజిటల్ బుక్కును కూడా ఏర్పాటు చేశారు. ఇందులో తమకు జరిగిన అన్యాయం గురించి తెలియజేసుకోవచ్చని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కచ్చితంగా న్యాయం చేసేలా చూస్తామంటు హామీ ఇచ్చారు. ఇప్పుడు నియోజవర్గాల వారిగా కార్యకర్తలకు సంబంధించి గుర్తింపు  వ్యవహారంలో అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: