ఈ
మూవీ ని
జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
సినిమా తర్వాత
జనవరి 14 వ తేదీన శర్వానంద్
హీరో గా రూపొందిన నారి నారి నడుమ
మురారి ,
నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందిన అనగనగా ఒక రాజు సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఈ ఐదు తెలుగు సినిమాలు ఈ సంవత్సరం
సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ఈ ఐదు సినిమాలలో కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్నా కూడా
రవితేజ నటించిన
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు తక్కువ ప్రీ రిలీజ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 25 నుండి 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకు తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడానికి ప్రధాన కారణం
రవితేజ వరుస అపజాలను అందుకోవడమే అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.