బాలీవుడ్ చందమామ కొత్త మిషన్.. పిల్లల ప్రపంచం వెండితెరపైకి!

Amruth kumar
బాలీవుడ్ చందమామ అలియా భట్ అంటే కేవలం గ్లామర్, పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు.. బిజినెస్ మైండ్‌లోనూ తను ఒక ‘స్టార్’ అని నిరూపిస్తోంది. నటిగా పతాక స్థాయికి చేరిన అలియా, ఇప్పుడు నిర్మాతగా తన సామ్రాజ్యాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో విస్తరిస్తోంది. ఇప్పటికే తన ‘ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్’ ద్వారా వైవిధ్యమైన సినిమాలు తీసిన ఈ బ్యూటీ, తాజాగా తన 33వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది.అలియా భట్ తన నయా బ్యానర్ ‘ఎటర్నల్ కిడ్స్’ (Eternal Kids) తో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.



తల్లిగా మారిన తర్వాత అలియా ఆలోచనా ధోరణిలో భారీ మార్పు వచ్చింది. తన కూతురు రాహా భట్ లాంటి చిన్నారులకు అద్భుతమైన కథలను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించింది.తన మెయిన్ బ్యానర్‌కు ఈ ‘ఎటర్నల్ కిడ్స్’ ఒక చిన్నారి లాంటిదని అలియా అభివర్ణించింది. "మా చిన్నప్పుడు మేము విని పెరిగిన కథలను మళ్ళీ సజీవం చేయబోతున్నాం" అంటూ అలియా ఎమోషనల్ అయ్యారు. పిల్లల ప్రపంచంలో ఉండే ఆ అమాయకత్వాన్ని, అద్భుతాలను వెండితెరపై ఆవిష్కరించడమే ఈ బ్యానర్ ముఖ్య ఉద్దేశం.


అలియా కేవలం ప్రకటనతో ఆగిపోలేదు, అప్పుడే పని మొదలుపెట్టేసింది. ఈ కొత్త బ్యానర్‌లో ఇప్పటికే మూడు క్రేజీ ప్రాజెక్టులు పట్టాలెక్కడం విశేషం. ‘సీ’ (C), ‘జీ’ (G), ‘ఎం’ (M) అనే వర్కింగ్ టైటిల్స్‌తో మూడు సినిమాలు సెట్స్ పైకి వెళ్తున్నాయి. గతంలో ‘డార్లింగ్స్’, ‘జిగ్రా’ వంటి సినిమాలతో నిర్మాతగా తన సత్తా చాటిన అలియా, ఇప్పుడు కిడ్స్ కంటెంట్‌తో మరో భారీ సక్సెస్‌ను అందుకోవాలని కసితో ఉంది.అలియా భట్ మాత్రం తన ‘ఎటర్నల్’ ప్లానింగ్‌తో దూసుకుపోతోంది. భర్త రణబీర్ కపూర్ ‘రామాయణం’ ఒకవైపు, అలియా ప్రొడక్షన్ విశేషాలు మరోవైపు నెట్టింట పూనకాలు తెప్పిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: