ఆ హీరోయిన్ తో మహేశ్ బాబు మిస్ బీహేవ్ చేశాడా..? తెలుగు హీరోల పరువు తీస్తున్నాడు..!

Thota Jaya Madhuri
టాలీవుడ్ సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్నారు. వయస్సు పెరుగుతున్నా కూడా ఎనర్జీ, ఫిట్‌నెస్, స్టార్‌డమ్ పరంగా ఆయన ఇప్పటి కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఇప్పుడు మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘వారణాసి’తో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు దాదాపుగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం. ఒక్కో పాత్ర ఒక్కో కోణంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.



ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తుండటం మరో విశేషం. చాలా కాలం తర్వాత ప్రియాంక చోప్రా ఒక భారతీయ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక, ఈ సినిమాతో సౌత్ ఇండియాలోనూ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.అయితే ఇలాంటి పాజిటివ్ హైప్ నడుస్తున్న సమయంలో, ఈ మూవీకి సంబంధించి ఒక వివాదాస్పద అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు అనే వ్యక్తి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.



ఉమైర్ సంధు తన ట్వీట్‌లో ‘వారణాసి’ సినిమా షూటింగ్ సమయంలో ప్రియాంక చోప్రాకు అవమానం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. షూటింగ్ సమయంలో మహేష్ బాబు ప్రియాంక చోప్రా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. అంతేకాదు, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ, ఈ సినిమా తర్వాత ప్రియాంక చోప్రా ఇకపై సౌత్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయబోదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్‌గా మారి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు ఈ ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మహేష్ బాబు అంటే క్రమశిక్షణ, మర్యాద, విలువలకు ప్రతిరూపం. ఆయనను ఇలా అవమానించేలా మాట్లాడటం అసహ్యకరం” అంటూ అభిమానులు ఉమైర్ సంధుపై ఫైర్ అవుతున్నారు.



కొంతమంది అభిమానులు మహేష్ బాబును శ్రీరామచంద్రుడితో పోల్చుతూ, ఆయన వ్యక్తిత్వం అంత ఉన్నతమైనదని కౌంటర్లు ఇస్తున్నారు. మరికొందరు అయితే “టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ ఉమైర్ సంధు పెద్ద శనిలా దాపురించాడు” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా టాలీవుడ్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు.మొత్తానికి, ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే మహేష్ బాబు టీమ్ గానీ, సినిమా యూనిట్ గానీ ఇప్పటివరకు ఈ వివాదంపై అధికారిక స్పందన ఇవ్వలేదు. అభిమానులు మాత్రం ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, మహేష్ బాబు ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రచారం జరుగుతోందని గట్టిగా నమ్ముతున్నారు.



ఇక ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో, దీనిపై సినిమా యూనిట్ స్పందిస్తుందో లేదో చూడాలి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు… ‘వారణాసి’ సినిమాపై అంచనాలు ఎంత పెరిగాయో, అంతే స్థాయిలో ఈ వివాదం కూడా ఇప్పుడు చర్చకు దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: