నవీన్ పోలిశెట్టి క్రేజ్ మామూలుగా లేదుగా.. అనగనగా ఒక రాజు మూవీకి అన్ని కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఇక ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ లో నవీన్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దానితో ఈ మూవీ ద్వారా నవీన్ కి తెలుగు సినీ పరిశ్రమలో ఒక మంచి గుర్తింపు వచ్చింది.


ఆ తర్వాత ఈయన నటించిన జాతి రత్నాలు , మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ లు కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. తాజాగా ఈయన అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ విడుదల చేయనున్నారు. నవీన్ పోలిశెట్టి వరుస పెట్టి విజయాలను అందుకుంటూ రావడం , ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానితో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.  


ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 45 నుండి 55 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే దానిని రాబట్టాలి అంటే ఈ మూవీ కి మంచి పాజిటివ్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రావాల్సి ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: