ధనం మూలం ఇదం జగత్
అయితే ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి.. ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. తర్వాత ఆయనకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపుల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అనంతరం మద్యంతర బెయిల్ ద్వారా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్క రాత్రి జైలులో ఉండి తెల్లవారగానే జైలు నుంచి ఇంటికి వచ్చారు. ఆయన ఇంటికి తిరిగివచ్చిన వెంటనే ఆయన సతీమణి స్నేహ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కూతురు అర్హ, కొడుకు అయాన్ కూడా ఎమోషనల్ అయ్యి నాన్నని హద్దుకున్నారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాన్న ఒక్కరోజు దూరంగా ఉంటేనే పిల్లలు బాధపడ్డారు. అలాంటిది కనిపెంచిన అమ్మ శాశ్వతంగా దూరం అయితే ఆ బాధ ఇంకా ఎలా ఉంటుంది అని శ్రీ తేజ్ పరిస్తితి గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి కొందరు ధనం మూలం ఇదం జగత్ అంటూ డబ్బు ఉంటేనే ఈ లోకంలో అన్నీ ఉంటాయి అని పోస్టులు పెడుతున్నారు.