త్రివిక్రమ్ - సునీల్ పెళ్లి వెనక అంత పెద్ద స్టోరీ నడిచింద‌నే విషయం మీకు తెలుసా..?

frame త్రివిక్రమ్ - సునీల్ పెళ్లి వెనక అంత పెద్ద స్టోరీ నడిచింద‌నే విషయం మీకు తెలుసా..?

Amruth kumar
టాలీవుడ్ అగ్ర దర్శకులలో స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు .. అలాగే ఒకప్పటి స్టార్ పాన్ ఇండియా నటుడు సునీల్ గురించి కూడా పరిచయం అక్కర్లేదు .. వీరిద్దరు కూడా అందరికీ సుపరిచితులే .. సునీల్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మధ్య స్నేహ సంబంధం ఉందని కూడా అందరికీ తెలుసు .. ఇక చాలా సందర్భాల్లో కూడా వీళ్ళిద్దరూ వారి యొక్క స్నేహం గురించి ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు .. ఇక గతంలో కూడా వీళ్ళు ఇద్దరు కలిసి పలు సినిమాల్లో కూడా చేశారు నటించారు ..

ప్రస్తుతం ఎవరు పనిలో వారు బిజీగా దూసుకుపోతున్నారు .. త్రివిక్రమ్ శ్రీనివాస్ గత సంక్రాంతికి మహేష్ తో గుంటూరు కారం సినిమా చేసి భారీ ప్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు .. ఆ సినిమా తర్వాత మళ్లీ మరో సినిమాను ప్రకటించలేదు త్రివిక్రమ్ .. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ తన తర్వాత సినిమాను అల్లు అర్జున్ తో కన్ఫామ్ చేశారని అంటున్నారు  .. అది కూడా భారీ పాన్ ఇండియా సినిమాగా ఎవ‌రు ఊహించిన రేంజ్ లో తీయబోతున్నారట . ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తో తన కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలు వేసుకున్నాడు . అలాగే త్రివిక్రమ్ , అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి .

ఇక ఇప్పుడు రాబోయే నాలుగో సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి .. త్రివిక్ర‌మ్ , సూనీల్ త‌మ‌ స్నేహాన్ని పెళ్లి రూపంలో కూడా చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. త్రివిక్రమ్ సునీల్ పెళ్లి కూడా ఒకేసారి జరిగింది. కేవలం కొన్ని గంటలది వ్యవధిలోనే వీళ్ళ పెళ్లి జరిగింది. అది కూడా హైదరాబాద్లోనే. 2002లో అక్టోబర్ 11న త్రివిక్రమ్ శ్రీనివాస్ సౌజన్య ని పెళ్లి చేసుకున్నారు. అదే రోజు సునీల్ సాయంత్రం ఏడు గంటలకి హైదరాబాద్లో శిల్పారామంలో శృతి ని పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: