స్పిరిట్ : ప్రభాస్ కి జోడిగా మృణాల్ ఠాకూర్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!!

murali krishna
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు అదే ఊపుతో అదే క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం చేతినిండా బోలెడు పాన్ ఇండియా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోల జాబితాలో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ చివరగా సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2, ప్రాజెక్ట్ కే లాంటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా తరువాత సందీప్ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా స్క్రిప్ట్ ని దాదాపుగా లాక్ చేసినట్టే తెలుస్తోంది. ఫైనల్ నెరేషన్ ఒకసారి అయ్యాక షెడ్యూల్స్ వేయబోతున్నారట. టి సిరీస్, భద్రకాళి జంట నిర్మాణంలో రూపొందబోయే ఈ ప్యాన్ ఇండియా మూవీకి ఇప్పటికిప్పుడు అడ్వాన్సులు తీసుకున్నా వంద కోట్ల పైమాటే వచ్చేలా ఉంది. సందీప్ అలాగే ప్రభాస్ కాంబినేషన్లో మూవీ అంటే తప్పకుండా వందల కోట్లు కలెక్షన్లు సాధించడం ఖాయం అన్న అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా అప్డేట్లు వినిపించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే స్పిరిట్ లో డార్లింగ్ కు జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని దాదాపుగా ఓకే చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే కీలక పాత్రల్లో సైఫలిఖాన్ కరీనాకపూర్ కనిపించనున్నట్లు హిందీ వెబ్ సైట్లు రాసుకొచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని, ఈ ముగ్గురిలోనూ ఎవరితోనూ చర్చలు కూడా జరపలేదని మూవీ టీమ్స్ స్పష్టతనిచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే ప్రస్తుతానికి చర్చలు జరిగాయని, సందీప్ వంగా ఓకే అనుకుంటే వెంటనే అగ్రిమెంట్ రాసుకుంటారని తెలుస్తోంది. హీరోయిన్గా ఇప్పటికే పలువురీ పేర్లు వినిపించినప్పటికీ మృణాల్ పేరు ఫైనల్ అయ్యేలా కనిపిస్తోంది. మరి ఈ వార్తలపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: