ఆ విషయంలో సమంత కంటే స్పీడ్ గా ఉన్న శోభిత ధూళిపాళ్ల ..అప్పుడే అలాంటి పని..!?
ఒకప్పుడు ఎక్కడ చూసినా సరే జనాలు హీరోయిన్ గానే చూసేవారు . కానీ ఇప్పుడు మాత్రం ఆమెను స్టార్ ఇంటికి కోడలుగా ట్రీట్ చేస్తూ ఫుల్ గా గౌరవిస్తున్నారు . కాగా రీసెంట్గా శ్రీశైలం మల్లన్న గుడిలో నాగచైతన్య పక్కన శోభిత కనపడగానే.. అక్కడివాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఇప్పుడు శోభిత ధూళిపాళ్లకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. శోభిత ధూళిపాళ్ల ఏ విషయం చేసిన సరే దానికి సమంతని ముడిపెడుతూ ఉంటారు జనాలు . అది అందరికీ తెలుసు .
అయితే సమంత పెళ్లి తర్వాత అక్కినేని ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి చాలా టైం పట్టింది . అంత ఈజీగా అక్కినేని ఇంటి కోడలు వ్యవహారాలను చక్కదిద్దలేకపోయింది సమంత. కానీ శోభిత ధూళిపాళ్ల మాత్రం ఆ విషయంలో చాలా ముందడుగు వేసేసింది . అక్కినేని ఇంటి కోడలుగా కర్తవ్యాలను పూర్తిగా నిర్వర్తిస్తుందట . మరి ముఖ్యంగా నాగచైతన్య బాగోగులు చూసుకోవడమే కాకుండా అత్తమామలుగా అమల - నాగార్జునలకు స్పెషల్ గా కూడా వండి పెడుతుందట. అంతేకాదు అక్కినేని బిజినెస్ వ్యవహారాలను సైతం చూసుకుంటుందట . దీంతో సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ల టూ ఫాస్ట్ అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు సమంత కంటే శోభిత ధూళిపాళ్ల చాలా స్పీడ్ గా ఉంది అంటూ కూడా మాట్లాడుతున్నారు జనాలు..!