అల్లు అర్జున్ , స్నేహ రెడ్డి వీడియో .. సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్ ..!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరో గా వచ్చిన పుష్ప 2 రిలీజ్ సమయం లో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద అభిమాని మృతి కి సంబంధించి అల్లు అర్జున్ ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి శనివారం మధ్యంతర బెయిల్ పై విడుదల చేసిన విషయం తెలిసిందే .. ఇక అల్లు అర్జున్ అరెస్టు శనివారం ఉదయం జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ను చూసి కుటుంబ సభ్యులందరూ చాలా ఎమోషనల్ అయ్యారు .
ఇక జైలు నుంచి ఇంటి కి రాగానే ముందు గా అల్లు అర్జున్ సోదరుడు అల్లు సురేష్ , అన్న ను గట్టి గా పట్టుకుని కౌగిలించుకున్నాడు .. ఆ తర్వాత ఆయన కొడుకు అయాన్ కూడా దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత వెంటనే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చి అల్లు అర్జున్ ను పట్టుకుని ముద్దులు పెడుతూ ఎమోషనల్ అయింది .. అల్లు స్నేహారెడ్డి ఎమోషనల్ అవటం తో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది .
ఇక తాజా గా సమంత ఆ వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ.. ( నేను కూడా ఎంతో ఎమోషనల్ అయ్యాను ) “ నేను ఏడవడం లేదు , సరేనా! ” అని పేర్కొంది . కన్నీటి ఎమోజీల తో , అర్జున్ , స్నేహ లను ట్యాగ్ చేస్తూ ఆ వీడియో ను తన సోషల్ మీడియా వేదిక గా షేర్ చెయ్యడం తో వైరల్ గా మారింది . కేవలం సమంత నే కాదు నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఇలా ఇప్పటి కే చాలా మంది సినీ సెలబ్రిటీస్ ఈ విషయం పై స్పందించారు .